TELANGANA HIGH COURT SENSATIONAL COMMENTS ON PRABHAS LAND CASE TA
Prabhas High Court: ప్రభాస్ స్థలంపై హైకోర్టు కీలక తీర్పు..
ప్రభాస్,తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని హీరో ప్రభాస్‌కు చెందిన 2083 చదరపు గజాల స్థలంలో ఉన్న నిర్మాణాలపై ఎవరికీ అప్పజెప్పకుండా యథాతథా ఆదేశాలను పాటించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని హీరో ప్రభాస్‌కు చెందిన 2083 చదరపు గజాల స్థలంలో ఉన్న నిర్మాణాలపై ఎవరికీ అప్పజెప్పకుండా యథాతథా ఆదేశాలను పాటించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ స్థల వివాదానికి సంబంధించిన గతేడాది ఏఫ్రిల్ 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ధర్మాసనం పేర్కొంది.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలోని 2083 గజాల స్థలం ప్రభుత్వానికి అంటూ ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. ఆ ఆస్తిని పిటిషనర్ ప్రభాస్‌కు స్వాధీనం చేయాల్సిన అవసరం లేదని.. వాటిని రెవెన్యూ అధికారుల స్వాధీనంలో ఉంచాలని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రభాస్.. ఈ స్థలం యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టులో న్యాయ పోరాటం చేయవచ్చని ఆదేశాలిచ్చింది.
ప్రభాస్ (Twitter/Photo)
హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగానే.. హీరో ప్రభాస్ రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఇంజక్షన్ కాపీ తెచ్చుకొని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయిని.. ఈ ఆస్తిని ఎటు కదిలించడానికి స్వాధీనానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి చెప్పిన విషయాలు మరోసారి.. ఈ భూములు చాల ఏళ్ల నుంచి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం కాగితాలు చూసి అవి తమ అధీనంలో ఉన్నాయని చెప్పడం సరికాదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఆక్రమణధారులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయిని, వారిని ఖాళీ చేయించడానికి భూ ఆక్రమణ నిరోధక చట్టాలు ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. 1958 నుంచి ఈ భూమిపై వివాదం నడుస్తోందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అంతేకాదు ప్రభాస్ క్రమబద్దీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తు పరిష్కరిస్తే..ఇలాంటి భూ వివాదం ఉన్న మరికొందరు కూడా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుందని, అదే సమయంలో వివాదాలు పరిష్కారమవుతాయని ప్రభుత్వానికి కోర్టు సలహా ఇచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.