ఏ ముహూర్తానా రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో అప్పటి నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. కేవలం ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయా పరిణామాల నేపథ్యంలో పూర్తి వివాదాస్పదంగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో పాటు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాలను విడదలను నిలుపుదల చేయాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చెపట్టిన హైకోర్టు ఈ సినిమాల విడుదల విషయంలో జోక్యం చేసుకోలేమంటూ చెప్పింది.
ప్రతి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్చ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సినిమా విడుదలను నిలుపుదల చేసే అధికారం మాకు లేదంటూ ఈ కేసును కొట్టివేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ ఇతరత్రా కారణాల వల్ల ఈ సినిమాను మార్చి 29 విడుద ల చేయనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Lakshmis NTR, NTR, NTR Biopic, Ram Gopal Varma, RGV, Telugu Cinema, Tollywood