HOME » NEWS » movies » TELANGANA HIGH COURT GIVEN SHOW CAUSE NOTICE TO RGV FOR DISHA ENCOUNTER MOVIE PK

RGV Disha Encounter: ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా రిలీజ్‌కు హై కోర్ట్ స్టే.. వర్మకు షోకాజ్ నోటీసు..

RGV Disha Encounter movie: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసును ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీస్తున్నాడు. చివరికి ఇలాంటి కథను కూడా సినిమాగా తీసి వాళ్ల కుటుంబాలతో ఆడుకుంటావా.. వాళ్ల ఎమోషన్స్‌తో నీకు పని లేదా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 24, 2020, 2:57 PM IST
RGV Disha Encounter: ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా రిలీజ్‌కు హై కోర్ట్ స్టే.. వర్మకు షోకాజ్ నోటీసు..
ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ సినిమా (RGV Disha Encounter)
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసును ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీస్తున్నాడు. చివరికి ఇలాంటి కథను కూడా సినిమాగా తీసి వాళ్ల కుటుంబాలతో ఆడుకుంటావా.. వాళ్ల ఎమోషన్స్‌తో నీకు పని లేదా అంటూ వర్మను ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. తాను చేయాలనుకున్న పని చేసి తీరుతాను అంటున్నాడు. దిశతో ఈ సినిమాకు సంబంధం లేదంటున్నాడు ఈయన. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. విడుదలకు సిద్ధమవుతుంది కూడా. ఇదిలా ఉంటే దిశ చనిపోయిన రోజే సినిమాను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని చూస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ చిత్రాన్ని నిలిపేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఇప్పుడు హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆపాలంటూ డిమాండ్ చేసాడు. ఇప్పుడు ఈ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు కూడా దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేయాలంటూ హైకోర్టులోని జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి ఆశ్రయించారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌పై హై కోర్టు స్టే విధించింది.

rgv disha encounter movie,rgv disha encounter movie case in high court,rgv disha encounter movie controversy,ram gopal varma disha movie,disha encounter movie trailer,disha encounter movie official trailer,disha ecounter telugu trailer,disha encounter ram gopal varma,disha encounter offical trailer review,rgv disha encouncter review,దిశ ఎన్‌కౌంటర్ సినిమా ట్రైలర్,దిశ ఎన్‌కౌంటర్ కాంట్రవర్సీ హై కోర్టు
ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ సినిమా (RGV Disha Encounter)


ఈ క్రమంలో అక్కడికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జొళ్లు శివ, జొళ్ళు నవీన్, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఇందులో తమ వాళ్ళను పూర్తి స్థాయి విలన్స్‌గా చూపిస్తున్నారని వాళ్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పటికే చచ్చిపోయిన వాళ్లను మరింత చంపేయాలని ఈ సినిమా తీస్తున్నారా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని ఈ చిత్రాన్ని ఆపాలంటూ వర్మను వాళ్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిటీషినర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కూడా కోర్టుకు ఇదే విన్నవించారు. నిందితుల కుటుంబాలను మరింత చిధ్రం చేయడానికి ఈ సినిమా చేస్తున్నారా అంటూ ఆయన కోరాడు.

rgv disha encounter movie,rgv disha encounter movie case in high court,rgv disha encounter movie controversy,ram gopal varma disha movie,disha encounter movie trailer,disha encounter movie official trailer,disha ecounter telugu trailer,disha encounter ram gopal varma,disha encounter offical trailer review,rgv disha encouncter review,దిశ ఎన్‌కౌంటర్ సినిమా ట్రైలర్,దిశ ఎన్‌కౌంటర్ కాంట్రవర్సీ హై కోర్టు
ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ సినిమా (RGV Disha Encounter)


సుప్రీం కోర్టు నియమించిన కమీషన్‌కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. ఓవైపు ఎంక్వైరీ నడుస్తుంటే మరోవైపు అవేం పట్టించుకోకుండా దిశ కథను సినిమాగా ఎలా తెరకెక్కిస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది కూడా ఇదే ప్రశ్నించడంతో కోర్టు కూడా ఆయన వాదనతో ఏకీభవించింది. ఈ క్రమంలోనే వర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాను రెండు వారాల పాటు నిలిపేయాలని ఆదేశించింది. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: November 24, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading