వాల్మీకి సినిమాకు తెలంగాణ హై కోర్ట్ షాక్.. హరీష్ శంకర్, వరుణ్ తేజ్‌కు నోటీసులు..

Valmiki movie controversy: ఏ క్షణంలో తన సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టాడో తెలియదు కానీ అప్పట్నుంచి ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లోనే విడుదల ఉండగా ఇప్పుడు తెలంగాణ హై కోర్ట్ వాల్మీకికి సూపర్ షాక్ ఇచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 4:58 PM IST
వాల్మీకి సినిమాకు తెలంగాణ హై కోర్ట్ షాక్.. హరీష్ శంకర్, వరుణ్ తేజ్‌కు నోటీసులు..
వాల్మీకి పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ఏ క్షణంలో తన సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టాడో తెలియదు కానీ అప్పట్నుంచి ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లోనే సినిమా విడుదల కానుందనగా ఇప్పుడు తెలంగాణ హై కోర్ట్ వాల్మీకికి సూపర్ షాక్ ఇచ్చింది. ఈ చిత్ర టైటిల్‌పై ముందు నుంచి కూడా రచ్చ నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాపై హై కోర్టులో విచారణ జరిగింది. వాల్మీకి టైటిల్ మార్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బోయహక్కుల పోరాట సమితి. తమ కులస్తులను కించపరిచే విధంగా వాల్మీకి టైటిల్ పెట్టారని.. అందుకే వెంటనే ఈ టైటిల్ తొలగించాలని పిటీషనర్ కోర్టుకు విన్నవించుకున్నాడు.
Telangana High Court given notice to Valmiki movie and Shock to Harish Shankar Varun Tej pk ఏ క్షణంలో తన సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టాడో తెలియదు కానీ అప్పట్నుంచి ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లోనే విడుదల ఉండగా ఇప్పుడు తెలంగాణ హై కోర్ట్ వాల్మీకికి సూపర్ షాక్ ఇచ్చింది. Valmiki movie controversy,Valmiki movie,Valmiki movie release date,varun tej Valmiki movie controversy,harish shankar Valmiki movie controversy,varun tej twitter,telangana High court notice Valmiki movie,high court Valmiki movie controversy,Valmiki controversy,pooja hegde varun tej,telugu cinema,వాల్మీకి,వాల్మీకి కాంట్రవర్సీ,వాల్మీకి వరుణ్ తేజ్,వాల్మీకి హరీష్ శంకర్,తెలుగు సినిమా
వాల్మీకి పోస్టర్ (Source: Twitter)

దీనిపై విచారించిన కోర్ట్ చిత్రయూనిట్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్, డిజీపీ, హీరో వరుణ్ తేజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హై కోర్ట్. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. తమిళనాట విజయం సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. మరి ఈ చిత్రం వివాదాల నుంచి బయటపడి అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో చూడాలి.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు