TELANGANA GOVT REDUCES TICKET RATES TO VARUN TEJ MOVIE GHANI SB
Ghani: గని సినిమాకు కేసీఆర్ సర్కార్ షాక్.. టికెట్ల రేట్లు తగ్గించిన ప్రభుత్వం
Ghani Pre release event Photo : Twitter
కరోనా కారణంగా అనేక వాయిదాల తర్వాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది వరుణ్ తేజ్ గని సినిమా. అయితే సినిమా విడుదలకు ముందే కేసీఆర్ సర్కార్ గని టీంకు షాక్ ఇచ్చింది.
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. త్వలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూవీ టీంకు భారీ షాకిచ్చింది. తెలంగాణలో గని మూవీకి టికెట్ల రేటు పెంచడం లేదని పాత రేట్స్ ప్రకారమే మూవీ టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాత రేట్ల ప్రకారం అయితే.. మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రిన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది.
వైజాగ్‌లో రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. కిరణ్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమన్ గని మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. గని సూపర్ హిట్ కావాలని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో గని సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో ఆ మూవీ టీం ఆందోళన పడింది. మరోవైపు.. టికెట్ రేట్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కరోనా తర్వాత సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్స్ రేట్లు తగ్గించడం ఓ సమస్య అయితే.. థియేటర్లలో షోలు కూడా తగ్గించడం కొత్త సినిమాలకు మైనస్‌గా మారింది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు గని సినిమాకు రేట్లను తగ్గిస్తూ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇక గని సినిమా విషయాని వస్తే.. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.