• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TELANGANA GOVERNOR NARASIMHAN INTERESTING COMMENTS ON SUPER STAR MAHESH BABU TA

సూపర్ స్టార్ మహేష్ బాబు పై గవర్నర్ నర్సింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు పై గవర్నర్ నర్సింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహేష్ బాబు పై సూపర్ స్టార్ గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు (Facebook/Photo)

దాదాపు పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సేవలందించడమే గాకుండా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడిగా ఉన్న గవర్నర్ నరసింహన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    దాదాపు పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సేవలందించడమే గాకుండా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడిగా ఉన్న గవర్నర్ నరసింహన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తన పదవీ కాలం ముగిసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన చివరి సారిగా గవర్నర్ హోదాలో మీడియాతో సమావేశమై చర్చించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి మంచి జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నట్టు నరసింహన్ అన్నారు.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చినప్పుడు హైదరబాద్‌లో కర్ఫ్యూ ఉందన్నారు నరసింహన్. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు రాష్ట్రంలో శాంతికి సహకరించాయన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గుళ్ల చుట్టూ తిరుగుతున్నారన్న ప్రచారం తనకు కొంత బాధ కలిగించిందని అన్నారు. తాను ఆలయాలన్నీ తిరగలేదన్నారు. మీరు గవర్నర్‌గా కొనసాగిన కాలంలో తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నకు నరసింహన్ మాట్లాడుతూ... నేను ఎప్పుడూ టఫ్ డెసిషన్లు తీసుకోలేదు. నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నర్ తీసుకోరు. మీడియా నేను టఫ్ మ్యాన్ అని భావించి ఉండొచ్చు అని అన్నారు.

    మహేష్ బాబు ఫోటోతో మార్ఫింగ్ చేసిన గవర్నర్ నరసింహాన్ ఫోటో (Facebook/Photo)


    ఈ క్రమంలో నా గురించి ‘సర్వాధికారి' అని రాస్తూ ఫోటో పెట్టి ఓ పేపర్లో న్యూస్ రాశారు. ఆ ఫోటో చూసి నేనే ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చారు . నేను ఎప్పుడూ లైఫ్‌లో యూనిఫాం వేసుకోలేదు. యూనిఫాంతో మన ఫోటో ఎలా వచ్చింది? అనుకున్నాను. తల మాత్రం నాది ఉంది, బాడీ మహేష్ బాబుది ఉందని నరసింహన్ గుర్తు చేసుకున్నారు.నేను మహేష్ బాబును ఓ ఫంక్షన్లో కలిసినపుడు మహేష్ నీపై ఫోర్జరీ, చీటింగ్ కేసు పెడతాను అంటూ నవ్వుతూ అన్నానని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆ వార్త చూసి తాను నవ్వుకున్నట్లు గవర్నర్ తెలిపారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: