కరోనా నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా తెలంగాణ గవర్నమెంట్..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చికురుటాకులా వణికిపోతోంది. దీన్ని కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ ప్రకటించారు.

news18-telugu
Updated: May 4, 2020, 6:53 AM IST
కరోనా నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా తెలంగాణ గవర్నమెంట్..
తెలంగాణ ప్రభుత్వం Photo : Twitter
  • Share this:
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చికురుటాకులా వణికిపోతోంది. దీన్ని కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో అనేక పరిశ్రమలు భారీ కుదుపుకు లోనయ్యాయి. ఆ రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఈ లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన షూటింగ్స్ ఆగిపోయాయి. విడుదలకావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదలకాకపోతే ఈ సినిమాను నిర్మించిన నిర్మాత తీవ్ర నష్టాల్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ లాక్ డౌన్ కారణంగా ఈ పరిశ్రమపై ఆధారపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు షూటింగ్స్ , కొత్త సినిమాల విడుదల జరిగే అవకాశం లేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 3 నుండి 17కి పొడిగించడం జరిగింది. ఈ పరిస్థితుల మధ్య  సినీ రంగం ఎలా ముందుకు వెళ్లాలి.. తీసుకోవాల్సిన చర్యల గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఈనెల 5న అనగా రేపు మంగళవారం ఉదయం 10:30 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం సినీపరిశ్రమ ఎదుర్కోంటున్న ఇబ్బందల్నీ.. దానికి పరిష్కార మార్గాలు.. థియేటర్స్ యాజామాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు అంశాలను గూర్చి చర్చించనున్నట్లు సమాచారం.
First published: May 4, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading