Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం (Radhe Shyam) రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక వాయిదాల తర్వాత రాధేశ్యామ్ మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Prabhas) ప్రభాస్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ సర్కారు (telangana government) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 10ను గురువారం జారీ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు షోలను వేసుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే అర్ధరాత్రి 1 నుంచి ఉదయం 10 గంటల్లోపు ఎటువంటి షోలను ప్రదర్శించకూడదు. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో వీడియోను విడుదల చేసింది టీమ్. ఈ సరికొత్త (Radhe Shyam) ట్రైలర్స్‌ను చూస్తుంటే... సినిమా విజువల్ వండర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరో ఎత్తుకు తీసుకు వెళ్లడానికి టీమ్... ఓ ఖతర్నాక్ ప్లాన్ చేసింది. ఏకంగా రాజమౌళిని రంగంలోకి దింపింది టీమ్. రాజమౌళి, ప్రభాస్‌ను (Prabhas) ఇంటర్వూ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మరోవైపు ఈ (Radhe Shyam) సినిమాకు సాలిడ్ బుకింగ్స్ అప్పుడే మొదలైయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మాత్రం ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. దాదాపు వారం రోజులు గ్యాప్ ఉండగానే రాధే శ్యామ్ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ 2 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసిందని అంటున్నారు. యూకేలో కూడా ఇదే రెస్పాన్స్ ఉందట. దీంతో ఓవర్సీస్‌లో రాధే శ్యామ్‌కు (Radhe Shyam) ప్రీమియర్స్ నుంచి అదిరిపోయే కలెక్షన్స్ రావోచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ఖతర్నాక్ షిప్ సీక్వెన్స్ ఉందట. అంతేకాదు హాలీవుడ్ మూవీ టైటానిక్ సినిమాలో ఎండింగ్ ఎలా ఉంటుందో.. దాదాపుగా ఆ రేంజ్‌లో ఉంటుందని, అంతేకాదు అసలు టైటానిక్ క్లైమాక్స్‌ను మించి రాధేశ్యామ్ క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు. ఇక్కడ విషయం ఏమంటే విడుదలైన రెండు ట్రైలర్స్‌లో కూడా విజువల్స్ ఓ రేంజ్‌లో అదిరిపోయాయి. చూడాలి మరి రాధే శ్యామ్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఈ సినిమాకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పిరియాడికల్ లవ్‌స్టోరిగా వస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు.
#RadheShyam 5th Show permission granted in Telangana pic.twitter.com/V1O9JfAeXG
— T2BLive.COM (@T2BLive) March 10, 2022
ఇక ఈ సినిమాకు ఇక్కడి సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా హిందీకి మాత్రం సచిత్ బల్హరా, అంకిత్ బల్హరా, మితున్, అమల్ మాలీక్, మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.'సాహో' తరువాత (Prabhas) ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Keerthy Suresh : కాటన్ చీరలో మరింత అందంగా కీర్తి సురేష్.. అదరహో అనాల్సిందే..
ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spririt) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.