సంచలన నిర్ణయాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈయన ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా ఉంది. ఇప్పుడు ఈయన మరో సెన్సేషనల్ నిర్ణయానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. ఆన్లైన్ టికెట్స్ విక్రయంపై కేసీఆర్ సర్కార్ ఓ సంచలన నిర్ణయానికి తెర తీయబోతుంది. ఇప్పట్నుంచి తెలంగాణలో ఆన్లైన్ టికెట్స్ విక్రయాన్ని రద్దు చేస్తూ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై సినిమాటోగ్రపీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది.
ఆన్లైన్ టికెట్ బుకింగ్ పేరుతో పేటీఎం, బుక్ మై షో, జస్ట్ టికెట్స్, ఈజీ మూవీస్ లాంటి యాప్స్ అదనంగా ట్యాక్సులు వేస్తూ టికెట్స్ విక్రయిస్తున్నాయి. ఇప్పుడు దీనికి చెక్ పెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల సామాన్యుడికి చాలా డబ్బులు సేవ్ కానున్నాయి. అనవసరంగా ట్యాక్సుల పేరు చెప్పి సామాన్యుడి జేబును దోచేస్తున్నారు కాబట్టే ఇలాంటి సంచలన నిర్ణయం వైపు వెళ్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పట్నుంచి సినిమా టికెట్స్ కోసం ఫిల్మ్స్ ఫెడరేషన్ కార్పోరేషన్ అంటూ ప్రత్యేకమైన యాప్ క్రియేట్ చేసి.. అందులోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టికెట్స్ విక్రయం జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Talasani Srinivas Yadav, Telangana, Telugu Cinema, Tollywood