Theatres reopen in Telangana: తెలంగాణలో థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి..

థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)

Theatres reopen in Telangana: థియేటర్స్ ఓపెన్ చేసుకోమని కేంద్రం చెప్పి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలంగాణలో అలాంటి ప్రయత్నం అయితే చేయలేదు ఎగ్జిబిటర్లు. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్స్ తెరిచారు.. కానీ సినిమాలు లేక వెంటనే..

  • Share this:
థియేటర్స్ ఓపెన్ చేసుకోమని కేంద్రం చెప్పి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలంగాణలో అలాంటి ప్రయత్నం అయితే చేయలేదు ఎగ్జిబిటర్లు. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్స్ తెరిచారు.. కానీ సినిమాలు లేక వెంటనే మళ్ళీ మూసేసారు కూడా. ఎందుకంటే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని కండీషన్ పెట్టింది కేంద్రం. పైగా ఇప్పుడు ఆ 50 శాతం కూడా నిండటం లేదు. సినిమాలు లేకపోయేసరికి థియేటర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సిటీలలో థియేటర్స్ తెరిచి పాత సినిమాలు మళ్లీ ప్రదర్శిస్తున్నారు. అక్కడ 1000 మంది ఉండే థియేటర్‌కు కనీసం 20, 30 మంది ఆడియన్స్ కూడా రావడం లేదు. దాంతో తెరిచిన స్క్రీన్స్ మళ్లీ క్లోజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా థియేటర్స్ తెరుచుకోడానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనే మల్టీప్లెక్సులు, థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు వచ్చేసాయి.

theatres opening in telangana,cinema theatres are opening in telangana,telangana theatre owners association press meet,theaters in telangana,theaters reopen in telangana,confusion on theaters reopen in telangana,cinema theatre opening date telangana,theatres open in telanagana,cinema theatres in telangana,movie theartes open in telangana,తెలంగాణలో థియేటర్స్ రీ ఓపెన్,థియేటర్స్ రీ ఓపెన్ తెలంగాణ,తెలంగాణ ప్రభుత్వం అనుమతి
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్ ఓపెన్ చేసుకోండి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక లేఖ కూడా విడుదలైంది. కానీ దీనిపై దర్శక నిర్మాతల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా మరింత పెరిగిపోతుంది. రెండో దశ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతున్న సమయంలో థియేటర్స్‌కు జనం వస్తారా అనేది కూడా అనుమానమే. దాంతో ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఆలోచనలో పడిపోయారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో కూడా థియేటర్స్ ఓపెన్ అవ్వొచ్చని తెలుస్తుంది.

theatres opening in telangana,cinema theatres are opening in telangana,telangana theatre owners association press meet,theaters in telangana,theaters reopen in telangana,confusion on theaters reopen in telangana,cinema theatre opening date telangana,theatres open in telanagana,cinema theatres in telangana,movie theartes open in telangana,తెలంగాణలో థియేటర్స్ రీ ఓపెన్,థియేటర్స్ రీ ఓపెన్ తెలంగాణ,తెలంగాణ ప్రభుత్వం అనుమతి
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres Reopen)


డిసెంబర్‌లో సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదలవుతుందని సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా థియేటర్‌లోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. శానిటైజేషన్, సీటింగ్ మధ్య గ్యాప్, 200 మందికి మించని ఆక్యుపెన్సీ, మాస్కులు ఇలా ప్రతీ జాగ్రత్త తీసుకుంటే సినిమాలు హాయిగా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని మన ఎగ్జిబిటర్లు వాడుకుంటారో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: