TELANGANA GOVERNMENT GIVEN PERMISSION TO POST PRODUCTION WORKS FOR MOVIES PK
టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. పోస్ట్ ప్రొడక్షన్స్‌కు అనుమతి..
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలతో తలసాని భేటీ (Twitter/Photo)
ఒకటి రెండు కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి అన్ని పనులు మానేసి రెండు నెలలకు పైగా ఖాళీగా ఉండటం. కనీసం ఇంట్లో కూర్చుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి.
ఒకటి రెండు కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి అన్ని పనులు మానేసి రెండు నెలలకు పైగా ఖాళీగా ఉండటం. కనీసం ఇంట్లో కూర్చుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. కరోనా, లాక్డౌన్ పుణ్యమా అని దారుణంగా పడిపోయింది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. అసలు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోలేదు.. దాంతో గత 60 రోజులుగా అన్నీ ఆగిపోయాయి. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సినిమానే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కార్మికులకు ఈ రెండు నెలలు గంజి మెతుకులే గతయ్యాయి.
చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)
ఇక ఇప్పుడు ఒక్కొక్కటిగా మళ్లీ గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా చిరంజీవి ఇంట్లో కలిసారు. ఈ సమావేశానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఇందులో సినిమా ఇండస్ట్రీ సమస్యలను మంత్రికి వివరించారు సినిమా పెద్దలు. చిరంజీవి, నాగార్జున సహా చాలా మంది ఈ సమావేశంలో ఉన్నారు. ఇందులో సినిమా షూటింగ్‌లు, సినిమా థియేటర్స్ తెరుచుకోడానికి అనుమతులు వంటి వాటిపై చర్చించారు.
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Twitter/Photo)
ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం అనుమతులు ఇచ్చేసింది ప్రభుత్వం. వీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని.. ఈ పనులకు అనుమతి ఇస్తున్నట్టుగా తలసాని చెప్పడంతో సినిమా ఇండస్ట్రీకి కొంత ఊరట లభించింది. నిర్మాణం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు చకచకా ఈ పనులు జరుపుకోబోతున్నాయి. థియేటర్స్ ఓపెనింగ్ కూడా జరిగితే మళ్లీ గత వైభవం వస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.