Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 23, 2020, 3:02 PM IST
కేసీఆర్ (ఫైల్ ఫొటో)
గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలుగు ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురపించాడు. ఇన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న టాలీవుడ్‌కు కేసీఆర్ బాసటగా నిలుస్తున్నాడు. తమ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చాడు కేసీఆర్. ఈ క్రమంలోనే ఈయన వరాల జల్లు కురిపించాడు. ముఖ్యంగా 40 వేల సినిమా కార్మికులకు రేషన్ కార్డులు ఇచ్చాడు ఈయన. అంతేకాదు కరోనా కారణంగా ఏడు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడే ఉన్నాయి. ఆ కారణంగా చాలా మంది సినీ కార్మికులు పూటగడవని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు థియేటర్స్ ప్రారంభం అయ్యే దాకా.. సినిమా హాళ్లకు విద్యుత్ చార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు కేసీఆర్. అలాగే చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ వాటా రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. ఈ నేపథ్యంలోనే 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలకు చేయూతగా రీ యంబర్స్మెంట్ సాయంగా అందించి చిన్న సినిమాలను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు కేసీఆర్. దాంతో పాటు రాష్ట్రంలోని అన్ని రకాల థియేటర్స్‌లో షో లు పెంచుకునే వెసలుబాటు కల్పిస్తామని చెప్పారు. దాంతో పాటు ఢిల్లీ, కర్ణాటక, ముంబైల మాదిరే టికెట్స్ రేట్స్ కూడా సవరించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పాడు. ఏదేమైనా కూడా గ్రేటర్ ఎన్నికలకు కేసీఆర్ కురిపించిన వరాల జల్లుతో సినిమా ఇండస్ట్రీ కూడా సంతోషంలో మునిగిపోయింది.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 23, 2020, 3:02 PM IST