తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

Tollywood shootings: వచ్చేసింది.. చాలా రోజుల నుంచి సినిమా వాళ్లు వేచి చూస్తున్న శుభవార్త వచ్చేసింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌కు కూడా అనుమతి ఇస్తూ కేసీఆర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 6:36 PM IST
తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు అనుమతి (kcr movie shooting)
  • Share this:
వచ్చేసింది.. చాలా రోజుల నుంచి సినిమా వాళ్లు వేచి చూస్తున్న శుభవార్త వచ్చేసింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌కు కూడా అనుమతి ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విశేషాలను కూడా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, త్రివిక్రమ్, ఎన్ శంకర్, రాధాకృష్ణ, జెమిని కిరణ్, సి కళ్యాణ్, కొరటాల శివ సహా చాలా మంది సినిమా ప్రముఖులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసారు. తలసాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలతో తలసాని భేటీ (Twitter/Photo)
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలతో తలసాని భేటీ (Twitter/Photo)


ఈ సందర్భంగా లాక్‌డౌన్ ప్లస్ కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాల గురించి సిఎంకు వివరించారు సినీ పెద్దలు. వాటిని విన్న కేసీఆర్ సానకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. అన్నింటికీ తమ ప్రభుత్వం ఉందని.. సినిమా వాళ్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తలసాని చెప్పారు. అంతేకాకుండా నష్టోపోయిన సినిమా కార్మికులను ఆదుకునే కార్యక్రమం కూడా చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక అతి ముఖ్యమైన షూటింగ్స్ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

జూన్ మొదటి వారం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు షూటింగ్స్ కూడా చేసుకోవచ్చని కేసీఆర్ తెలిపారు. కానీ కోవిడ్ 19 నిబంధనలకు లోబడి మాత్రమే ఈ షూటింగ్స్ చేసుకోవాలని.. అక్కడ ఏం జరిగినా కూడా సినిమా నిర్మాత బాధ్యత తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. చిత్రీకరణ అనుమతితో పాటు థియేటర్స్ ఓపెనింగ్ విధి విధానాలపై మరో రెండు మూడు సమావేశాలు ఉంటాయని మంత్రి తలసాని తెలిపారు. వాటికి అనుగుణంగానే సినిమా వాళ్ళు నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading