ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతున్నాయి. ఈ వైరస్ కట్డడిలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నాలుగు పర్యాయాలు కేంద్రం లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో అన్నిరకాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పటికే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇపుడిపుడే కొన్నింటికి మినహాయింపులు ఇస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా పలు పరిశ్రమలు స్థంభించినా.. ఎక్కువగా నష్టపోయింది చిత్ర పరిశ్రమ అనే చెప్పాలి. ఈ ఇండస్ట్రీపై ఆధారపడి ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్స్ అన్ని మూత పడ్డాయి. ఇప్పట్లో రెండు మూడు నెలల వరకు ఇవి తెరచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లోగా చిత్ర పరిశ్రమ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి ? థియేటర్స్ నిర్ణయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయాలపై ఈ రోజు చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు.
ఈ భేటీలో చిరంజీవితో పాటు హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, సి.కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డితో దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, కొరటాల శివ పాటు పలువురు సినీ నిర్మాతలు,దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగ్స్ నిమిత్తమై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తారనే దానిపై చర్చలు జరిగాయి. షూటింగ్స్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సినీ కార్మికుల భవిష్యత్తుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై ఈ భేటిలో చర్చ జరిగింది. సినీ పెద్దలతో భేటీ తర్వాత తలసాని కేటినేట్లో చర్చించి త్వరలో సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Dil raju, Nagarjuna Akkineni, Suresh Babu, Talasani Srinivas Yadav, Tollywood