హోమ్ /వార్తలు /సినిమా /

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పండి ? సమంత మాత్రం కానే కాదు..!

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పండి ? సమంత మాత్రం కానే కాదు..!

సమంతలా కనిపిస్తున్న నటి

సమంతలా కనిపిస్తున్న నటి

సమంత సోదరిగా నటించిన ఈ భామ.. ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అచ్చం సమంతలా కనిపిస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

సమంత.. (Samantha) టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఏం మాయ చేశావే అంటూ.. తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సమంత.. ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా ఓ నటి ఫోటో చూసిన నెటిజన్స్ ఆమెను కూడా ఏంటి సమంతలా కనిపిస్తున్నావు అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం  ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. నటి షేర్ చేసిన ఫోటో చూస్తే మనకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. ఇంతకీ ఈ ఫోటో షేర్ చేసింది ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరో కాదు.. బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్విది.

తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తేజస్వి తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అయితే కొన్ని ఫోటోల్లో ఆమె అచ్చం సమంతలానే కనిపిస్తుంది. దీంతో ఆమె లుక్స్ చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. అయ్యో మేం సమంత అనుకున్నాం అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ‘చూడగానే సమంతలా ఉన్నారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘నేడు ఐడీ చెక్ చేశాను.. సమంతన కాదా అని తెలుసుకోవడానికి’ అంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టారు. ‘సడన్లీ చూడగానే సమంతనే అనుకున్నా’ ఇలా చాలామంది నెటిజన్లు తేజస్వి లుక్‌ను సమంతతో సరిపోల్చుతూ.. కామెంట్లు చేస్తున్నారు.

ఇక తేజస్వి విషయానికి వస్తే... హట్ ఫోటోలను, గ్లామర్ పిక్స్ షేర్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా ఇప్పుడు కూడా కాస్త గ్లామర్ డోస్ పెంచి పిక్స్ షేర్ చేసింది. ఇక అమ్మడు అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలా నువ్వు వేడి పుట్టిస్తుంటే.. వర్షాలు ఇంకా ఎక్కడ పడతాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వెరీ హాట్ అంటూ.. పోస్టులు, మంట పెట్టే ఫోటోలు షేర్ చేస్తున్నారు.


తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. ఆ తర్వాత Tejaswi Madivada .. మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక Ram Gopal Varma ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. అప్పటి నుంచి తేజస్వి గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. ఛాన్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ఉంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో సాయిధరమ్ తేజ్ కి మరదలిగా నటించింది.

First published:

Tags: Samantha Ruth Prabhu, Tejaswi madivada, Tollywood

ఉత్తమ కథలు