Home /News /movies /

TEJASHWINI ULTIMATUM DANCE PERFORMANCE IN SRIDEVI DRAMA COMPANY SHOW GOES VIRAL NR

Sridevi Drama Company - Tejashwini: శ్రీదేవి డ్రామా కంపెనీలో హాట్ డ్యాన్స్‌తో దుమ్ములేపిన తేజస్విని డ్యాన్స్.. మరి ఈ రేంజ్‌లోనా

Sridevi Drama Company - Tejashwini

Sridevi Drama Company - Tejashwini

Sridevi Drama Company - Tejashwini: బుల్లితెరలో ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక ప్రేక్షకులు మాత్రం ముందుగా ఎంటర్టైన్మెంట్ షో లకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పైగా బుల్లితెర ఛానెల్స్ కు ఎంటర్టైన్మెంట్ షో లతోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.

ఇంకా చదవండి ...
    Sridevi Drama Company - Tejashwini: బుల్లితెరలో ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక ప్రేక్షకులు మాత్రం ముందుగా ఎంటర్టైన్మెంట్ షో లకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పైగా బుల్లితెర ఛానెల్స్ కు ఎంటర్టైన్మెంట్ షో లతోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది. ఇక షో లలో కూడా మరింత స్పైస్ లను జోడిస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో హాట్ డాన్స్ తో సందడి చేసింది డాన్సర్ తేజస్విని (Dancer Tejaswini).

    ఈటీవీ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి ఎంటర్టైన్మెంట్ షోగా మారింది. ఇక ఇందులో మరో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సినీ నటి ఇంద్రజ ఈ షోలో జడ్జిగా చేస్తుంది. ఇక ప్రతి వారం ఇందులో బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలను ఆహ్వానించి సందడి చేస్తారు. పైగా ఈ షో రేటింగ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

    ఇది కూడా చదవండి:ఫ్రీగా ఉన్నారుగా అంటూ నటి హేమపై సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

    ఇందులో కేవలం ఒక్కటే కాకుండా అన్ని రకాల పర్ఫామెన్స్ రుచులను చూపిస్తారు. డాన్స్, సింగింగ్, పలు ఆర్టిస్ట్ పర్ఫామెన్స్, కామెడీ ఇలా అన్ని రకాల ఎంటర్ టైన్ లు ఈ షో ద్వారా వీక్షించవచ్చు. ఇదిలా ఉంటే ఈ వారం ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను బాగా సందడి చేసింది. ఇందులో పలువురు వెండితెర, బుల్లితెర ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.

    ఇది కూడా చదవండి:అదిరిపోయే కామెడీతో అదరగొడుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ.. నవ్వులే నవ్వులు!

    ఇక కంటెస్టెంట్ లు మాత్రం తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. ఈమధ్య యూట్యూబ్ లో ఫిదా చేసిన కొన్ని ప్రైవేట్ సాంగ్ లను పాడి వినిపించారు కొందరు సింగర్స్ స్ఫూర్తి, మౌనిక, శిరీష. ఇక వీరి పాటలతో మాత్రం సెలబ్రెటీలందరు డాన్స్ లతో బాగా ఎంజాయ్ చేశారు. ఇక సుధీర్ మాత్రం తన డాన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే డాన్సర్ తేజస్విని మాత్రం తన హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో దుమ్ము లేపింది. మధురమే ఈ క్షణమే.. ఓ చెలి, పరేషానురా, ఊరికే ఉడికిస్తావే వంటి పాటలతో అందర్నీ ఫిదా చేసింది. పైగా తన స్టెప్పులతో మాత్రం ప్రేక్షకులను కళ్లార్పకుండా చేసింది. ఇక ఈమె పర్ఫామెన్స్ లను సునీల్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా మొత్తానికి ఈమె డాన్స్ తో వేదిక మొత్తం బాగా సందడిగా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Etv show, Indraja, Sridevi drama company, Sudigali sudheer, Tejashwini, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు