• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TECHNICAL PROBLEM IN VISTARA AIRLINES FLIGHT IN WHICH MEGASTAR CHIRANJEEVI IS FLYING SB

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

మెగాస్టార్ చిరంజీవి

టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 120మంది ప్రయాణికులు ఉన్నారు.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ముంబై  నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ఫైలట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 120మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణాలతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సమాచారం. ఫైలట్ అలర్ట్ అయి సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో విమానం ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని హైదరాబాద్‌కు పంపారు. అయితే ఆ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న చిరంజీవిని ఫోటో తీసి ఓ ప్రయాణికులు తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ మెగాస్టార్ ఫోటో... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

     

     
    Published by:Sulthana Begum Shaik
    First published: