రజినీకాంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఈ వార్త విని గుండె జారినంత పనైపోయింది. ఈయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈయన చెన్నై నుంచి బయలుదేరాల్సిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 27, 2020, 3:29 PM IST
రజినీకాంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
రజినీకాంత్ (File/Rajinikanth)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఈ వార్త విని గుండె జారినంత పనైపోయింది. ఈయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈయన చెన్నై నుంచి బయలుదేరాల్సిన ఓ ప్రైవేటు విమానంలో ఎక్కాడు. అయితే ఉన్నట్లుండి అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో మరో ఆప్షన్ లేక రజినీకాంత్‌తో సహా ప్రయాణికులంతా రెండు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఎదురు చూసారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రైవేట్ జెట్ యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు. జనవరి 27 ఉదయం చెన్నై నుంచి మైసూర్‌ వెళ్లాల్సిన ఓ ప్రైవేటు విమానం టేకాఫ్‌కు ముందు సాంకేతిక లోపం తలెత్తింది.

Technical issue raised for Superstar Rajinikanth flight and he delays 2 hours in airport pk సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఈ వార్త విని గుండె జారినంత పనైపోయింది. ఈయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈయన చెన్నై నుంచి బయలుదేరాల్సిన.. Rajinikanth,Rajinikanth twitter,Rajinikanth flight,Rajinikanth flight dalays,Rajinikanth flight issue,Rajinikanth airport,Rajinikanth flight airport,Rajinikanth movies,telugu cinema,రజినీకాంత్,రజినీకాంత్ సినిమాలు,రజినీకాంత్ ఫ్లైట్ డిలే,రజినీకాంత్ ఎయిర్‌పోర్ట్
రజినీకాంత్  ఎక్కిన ఫ్లైట్‌లో సాంకేతిక లోపం (Special Arrangement/photo)


దాంతో ఎంతకీ మొదలు కాలేదు.. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. దాన్ని గమనించిన సిబ్బంది విమానంలోని 48 మంది ప్రయాణికులను దించేసి.. సాంకేతిక లోపాన్ని సవరించారు. అయితే 48 మంది ప్రయాణికుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రజనీ ఉన్నాడనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈయన సిరుత్తై శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీనికి అన్నాత్త అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: January 27, 2020, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading