తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం జై భీమ్ (Jai Bhim) . సూర్య 40వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా మాదిరిగానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది.
కాగా దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో దొంగలు మీ జాతిలోను, నా జాతిలోను ఉంటారు అనే డైలాగ్ నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. మహిళలపై పోలీసులు దాడులు చేయడం, లేనిపోని కారణాలతో అమాయకులని వేధిస్తున్న నేపథ్యంలో లాయర్‌గా సూర్య వారికి ఎలా అండగా నిలిచాడు అనేది కథాంశంగా ఉండనుంది. 1993 లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు చేసిన పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపోందించారని తెలుస్తోంది.
Here’s #JaiBhim Teaser for you!
Tamil - https://t.co/lJ4mat1vS5
Telugu - https://t.co/iT8vp3OmEw
Watch #JaiBhimOnPrime Nov 2 @PrimeVideoIN @tjgnan @RSeanRoldan @srkathiir @KKadhirr_artdir @philoedit #Jyotika @rajsekarpandian @2D_ENTPVTLTD pic.twitter.com/FrxaVluTT2
— Suriya Sivakumar (@Suriya_offl) October 15, 2021
ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్గా నటిస్తోండగా.. టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నటులు రావు రమేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మిస్తున్నారు.
Nani | Dasara : తెలంగాణ యువకుడిగా నాని.. దసరా రోజున కొత్త సినిమా ప్రకటన.. అదిరిన టైటిల్..
ఇక ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబర్ 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Anchor Anasuya : ప్రియమైనవారితో కారులో అనసూయ దసరా సంబరాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..
కథ మొదలు ప్రధాన పాత్రాధారుల నటన, స్క్రీన్ ప్లే, సుధా కొంకర దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం, నిర్మాణ విలువలు అన్నీ ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. 'ఆకాశం నీ హద్దురా'లో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Hero suriya, Tollywood news