Teachers Day Special: ఒకప్పటి వెండితెర బడి పంతుళ్లు..

మాతృదేవోభవా..!, పితృదేవోభవా..!,ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. కానీ నేటి గురువు స్థానం ఏమిటి? చేతులెత్తి మొక్కాల్సిన గురువులను వెండితెర ఎలా చూపిస్తోంది ? ఈ గురు పూజోత్సవం సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..!

news18-telugu
Updated: September 5, 2019, 2:10 PM IST
Teachers Day Special: ఒకప్పటి వెండితెర బడి పంతుళ్లు..
వెండితెర బడి పంతుళ్లు
  • Share this:
మాతృదేవోభవా..!, పితృదేవోభవా..!,ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. కానీ నేటి గురువు స్థానం ఏమిటి? చేతులెత్తి మొక్కాల్సిన గురువులను వెండితెర ఎలా చూపిస్తోంది ? ఈ గురు పూజోత్సవం సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..!ఐదేళ్ల వరకూ తల్లి గురువైతే ఆ తర్వాత ఓ పదిహేనేళ్లపాటు గురువు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఎవరి జీవితంలోనయినా గురువుకు అంతటి ప్రాధాన్యముంది. అలాంటి గురువుల్ని మన సినిమాలు ఎలా చూపించాయి ? తొలి రోజుల్లో గురువులకు తెలుగు చిత్రసీమ తగిన ప్రాధాన్యమిచ్చిందనే చెప్పాలి 1955లో వచ్చిన ‘మిస్సమ్మ’ టైటిలే గురువుకు సంబంధించిన శబ్దం. ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తి చుట్టే ప్రధానంగా నడుస్తుంది. హీరో హీరోయిన్లిద్దరూ స్కూల్లో టీచర్లుగా చేరడం స్టోరీలో మెయిన్ థీం. ఇది బెంగాలీ నవలైన మన్మోయి గాళ్స్ స్కూల్ నవల ఆధారంగా తెరకెక్కింది. స్కూలు టీచరు ప్రధాన ఇతివృత్తంగా సాగుతుందనే విషయం.

‘మిస్సమ్మ’లో ఎన్టీఆర్,సావిత్రి (Facebook/Photo)


బతకలేక బడి పంతులు అంటారు. కానీ, బతుకుతెరువునేర్పడంలో ఆ పంతులుకు మించిన వారు లేరు. 1972లో ‘బడిపంతులు’ అనే పేరున ఎన్టీఆర్ టైటిల్ రోల్ ప్లేచేసిన చిత్రాన్ని ఎంతో సందేశాత్మకంగా తెరకెక్కించారు. భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు అనే పాట ఇప్పటికీ అక్కడక్కడా మారుమోగుతూనే ఉంటుంది. గురు శిష్య సంబంధానికి అర్ధాన్ని పరమార్ధాన్ని చెబుతూ సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అద్భుతం.ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం’లో కూడా మహానటులు లెక్చరర్‌గా నట విశ్వరూపమే చూపించాడు.

బడి పంతుడు, విశ్వరూపం సినిమాల్లో ఉపాధ్యాయుడి పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్ (Facebook/Photo)


ఎన్టీఆర్ రూట్లేనే అక్కినేని నాగేశ్వరరావు కూడా ‘గురు బ్రహ్మా’ వంటి సినిమాల్లో గురువుగా నటించి మెప్పించడం విశేషం. మారిన సామాజిక పరిస్థితులతో కాలానుగుణంగా వెండితెరపై బడిపంతులు పాత్ర కొత్తరూపు సంతరించుకుంటూ వచ్చింది. మరోవైపు కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ కూడా గురు శిష్య బంధాన్ని గుర్తు చేసేదే.

Birth anniversary Tollywood Comedy Director Jandhyala స్మృతిలో: హాస్యబ్రహ్మా జంధ్యాల
శంకరాభరణం మూవీ


1977లో వచ్చిన ‘యువతరం కదిలింది’ అలాంటిదే. హిప్పీ సంస్కృతిని వీడి భూస్వామ్య వ్యవస్థకు, కులమతవర్గ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలనే సందేశంతో యువతరాన్ని చైతన్య పరిచిందా చిత్రం. ‘స్వరాజ్యం’ కూడా అలాంటి చిత్రమే. యువతరం కదిలింది ప్రేరణతో  ‘ఎర్రమల్లెలు’, ‘మహా ప్రస్థానం’ చిత్రాలు కూడా ఉపాధ్యాయ పాత్రను గొప్పగా చిత్రీకరించాయి.1980ల కాలానికి వచ్చేసరికి.. ఉపాధ్యాయ పాత్ర తీరు మారింది. కాస్త మాస్ అప్పీల్ జోడించారు. కృష్ణంరాజు నటించిన త్రిశూలం సినిమా చిన్ని గ్రామాల్లోని పాఠశాలల దుస్థితిని చాటిచెబుతుంది. కేవలం స్కూలు, పిల్లల మీదే సినిమా తీస్తే మాస్ ప్రేక్షకులకు ఎక్కదన్న ఉద్దేశంతో, చిత్రాన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిప్పారు. అయినా సరే ‘త్రిశూలం’లో కృష్ణంరాజు పాత్రలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా కనిపించి స్ఫూర్తి దాయకంగా నిలుస్తాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కృష్ణంరాజు ఇలాంటి పాత్రలు పోషించినా అవి జనాలకు అంతగా ఎక్కలేదు.

త్రిశూలం మూవీలో కృష్ణంరాజు (Youtube/Photo)


1986లో వచ్చిన ‘రేపటి పౌరులు’ ఉపాధ్యాయులంటే ఏమిటో అర్ధం చెప్పే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కేవలం నేపథ్యం కోసం పాఠశాల.. ప్రధాన పాత్రకు ఏదో ఒక వృత్తి ఉన్నట్లు చూపించాలి కాబట్టి చూపించడం అన్నట్టు ఉండదీ సినిమా. స్కూల్ టీచర్ని ఏదో ఒకట్రెండు సన్నివేశాలకు పరిమితం చేయకుండా సిన్మా యావత్తూ పిల్లలు, ఉపాధ్యాయుల చుట్టూనే సాగుతుంది. పాఠశాల విద్య ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఉపాధ్యాయులు తలుచుకుంటే పిల్లల్ని మెరికల్లాంటి సైనికుల్లా తీర్చిదిద్దగలరని చాటిచెప్పిందీ చిత్రం.

రేపటి పౌరులు (youtube/Photo)


‘రేపటి పౌరులు’ తీసిన టి.క్రిష్ణ ఆ తర్వాత ‘ప్రతిఘటన’ తీశారు. ఇది కూడా అత్యుత్తమ అధ్యాపక పాత్రను ఆవిష్కరించింది. నైన్టీస్‌లో తెలుగు సినిమా టీచర్ రూటు మారింది. దారి తప్పకుండానే కాస్త మసాలా దట్టించి సినిమాలు తీయడం మొదలైంది. అందులో ‘సుందరకాండ’ లాంటి చిత్రాలు కొన్ని వచ్చాయి.జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘హైహై నాయక’ సైతం పాఠశాల నేపథ్యంలో వచ్చిన చిత్రమే.

‘హై హై నాయకా’లో ఉపాధ్యాయుడి పాత్రలో నరేష్ (youtube/Photo)


స్కూల్లో టీచరెంత స్ట్రిక్ట్‌గా ఉన్నా.. వారికి సరైన విద్యాబుద్ధలు నేర్పించాలంటే.. ఇంట్లోని పెద్దల ప్రవర్తన కూడా సరిగా ఉండాలి. పెద్దల ప్రవర్తనే పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కనుక పిల్లల విషయంలో టీచర్లని తిట్టడం కాదు.. పెద్దలు కూడా పిల్లల ముందు ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలని చూపాడు దర్శకుడీ చిత్రంలో.  ఇవవ్నీ గురువును ఉన్నతంగా చూపెట్టాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 5, 2019, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading