HOME »NEWS »MOVIE »teachers day special latest generation silver screen teachers in tollywood ta

Teachers Day Special: సిల్వర్ స్క్రీన్ పై నవతరం ఉపాధ్యాయులు..

Teachers Day Special: సిల్వర్ స్క్రీన్ పై నవతరం ఉపాధ్యాయులు..
వెండితెర ఉపాధ్యాయులు (facebook/Photo)

Teachers Day Special:ఎన్టీఆర్, ఏఆన్నార్‌ల తరం తర్వాతి జనరేషన్ విషయానికొస్తే...ఇప్పటి తరంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు..ఉపాధ్యాయుల ఔనత్యాన్ని గుర్తు చేశాయి.

 • Share this:
  ఎన్టీఆర్, ఏఆన్నార్‌ల తరం తర్వాతి జనరేషన్ విషయానికొస్తే...ఇప్పటి తరంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు..ఉపాధ్యాయుల ఔనత్యాన్ని గుర్తు చేశాయి. 1992లో.. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వెంకటేష్, మీనా, అపర్ణ ప్రధాన పాత్రలు పోషించిన సుందరాకాండ సినిమా యావత్తూ లెక్చరర్ స్టూడెంట్ కేరెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. లెక్చరర్ మీద స్టూడెంట్ ప్రేమ పెంచుకోవడం అనే అంశం అంతర్లీనంగా సాగే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ, ప్రేక్షకులను ఆకర్షించేందుకు  అధ్యాపక పాత్రకు, విద్యార్ధినితో ప్రేమ వ్యవహారాన్ని జోడించి పెద్ద సాహసమే చేశారు దర్శక రచయితలు.

  సుందరకాండలో వెంకటేష్ (Facebook/Photo)
  2017లో వెంకటేశ్ నటించిన ‘గురు’ మూవీ కూడా గురు శిష్య అనుబంధాన్ని గుర్తు చేసేదే. కేవలం పాఠాలు చెప్పడమే కాదు...జీవితాన్ని మార్గ నిర్థేశం చేసేవాడు గురు అనే విషయాన్ని ఈ మూవీ గుర్తు చేసింది.

  గురు మూవీలో వెంకటేష్ (facebook/Photo)


  1997 లో చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘మాస్టర్’ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌ని బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రమే. ఇందులో మెగాస్టార్ యూత్‌ని సరైన దారిలో పెట్టే తెలుగు లెక్చరర్‌గా నటించారు. ప్రేమ దోమ అంటూ యువతరం ఫ్యూచర్ వేస్ట్ చేసుకోవడం సరికాదని ఈ మూవీలో చెప్పారు.

  ‘మాస్టర్’మూవీలో చిరంజీవి (Facebook/Photo)


  చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’తో వినాయక్ ఓ మంచి లెక్చరర్‌ని తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో చిరంజీవి పోషించిన ఫిజిక్స్ లెక్చరర్ కేరెక్టర్‌ని అత్యున్నత సామాజిక విలువలతో తీర్చిదిద్దారు. చిరంజీవి కూడా ఉన్నత విలువలు గల అధ్యాపకుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. సినిమాలో మెయిన్ థీం వేరేది కావడంతో ఈ పాత్రలోని అధ్యాపకుడు పెద్దగా హైలెట్ కాలేదు కానీ, తెలుగు తెరపై వచ్చిన మంచి అధ్యాపకుల్లో ‘ఠాగూర్’ మూవీ ఒకటి.

  ఠాగూర్’లో చిరంజీవి (Facebook/Photo)


  అంతకు ముందు 2001లో విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి తొలి సిన్మా ‘స్టూడెంట్ నెంబర్ వన్’. ఈ సినిమాలో బెస్ట్ స్టూడెంట్‌గా నటించి మార్కులు కొట్టేశాడు జూనియర్‌ఎన్టీఆర్. కాలేజ్ లెక్చరర్లు, విద్యార్థుల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో.. ఎక్కడో పుట్టి పాట ద్వారా అద్భుతంగా చూపారీ చిత్రంలో.

  స్టూడెంట్ నెం.1లో జూనియర్ ఎన్టీఆర్(facebook/Photo)


  2007లో రిలీజైన ‘హ్యాపీడేస్‌’లో క్లాస్‌రూమ్ సీన్స్‌లో మరికాస్త పరిపక్వత వచ్చింది. స్టూడెంట్స్ బయట ఎన్ని లవ్ గేమ్‌లు ఆడినా.. క్లాస్ రూమ్‌ని మాత్రం క్రమశిక్షణతో నడిపించడం మొదలైంది ఈ చిత్రంతోనే. దర్శకుడు శేఖర్ కమ్ముల నేపథ్యం కావచ్చు, ఆయన ఆలోచనాధోరణి కావచ్చు .. లెక్చరర్స్‌ని హుందాగా చూపించడానికే ప్రాధాన్యమిచ్చారు.

  హ్యాపీ డేస్ మూవీ (Facebook/Photo)


  ‘హ్యాపీడేస్’ ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’.. సినిమా సైతం తెలుగు ప్రేక్షకులకు మరో మంచి అధ్యాపకుడిని పరిచయం చేసింది. లెక్చరర్ అంటే జీవితపాఠాలు గొప్పగా విప్పి చెప్పేవాడని చూపించాడు దర్శకుడీ సినిమాలో. లెక్చరర్‌గా రావు రమేష్ మంచి మార్కులు వేయించుకున్నాడు.

  కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్ (Facebook/Photo)


  2010లో బాలయ్యకో బిగ్‌ హిట్‌ ఇచ్చిన ‘సింహా’కి కూడా కాలేజీ నేపథ్యమే కీపాయింట్‌. ఓ లెక్చరర్‌ నిబద్ధతతో, నిక్కచ్చిగా ఉంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారో చెప్పేలా లెక్చరర్‌ పాత్రని హీరోచితంగా చిత్రీకరించాడు దర్శకుడు బోయపాటి.

  ‘సింహా’లో బాలకృష్ణ (Facebook/Photo)


  2011లో వచ్చిన ‘గోల్కొండ హైస్కూల్’ కూడా ఉత్తమ గురువు ఎలా ఉండాలనేదానికి అద్దం పట్టింది. ఒక గురువు తలుచుకుంటే, విద్యార్ధుల్లోని క్రీడాకారులు ఎంతగా రాటు దేలతారో అద్భుతంగా చూపాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం గురుశిష్యుల సంబంధం వెలకట్టలేనిదని చెప్పేలా సాగుతుంది.

  గోల్కొండ హై స్కూల్‌ (facebook/Photo)


  కాలేజ్ బ్యాక్ డ్రాప్, స్టూడెంట్ లవ్, వండ్రఫుల్‌గా చూపించడంలో దిట్టయిన సుకుమార్ రూపొందించిన ‘100% లవ్’ కూడా కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంతో వచ్చిన చిత్రమే. ఈ కాలపు కుర్రకారు ఎంత పోటీతత్వంతో ఉన్నారో హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలిపే చిత్రమిది.

  100% లవ్ మూవీ (Facebook/Photo)


  ఇదే ఏడాది వచ్చిన ‘పిల్ల జమిందార్’ గురించి ప్రముఖంగా చెప్పాలి. గురు శిష్యుల బంధాన్ని గొప్పగా చూపిన చిత్రంగా నిలిచింది పిల్ల జమిందార్. ఆనాటి ఆశ్రమ విధానాన్ని కొత్తగా చూపుతూ గురువు ప్రాధాన్యాన్ని చాటిచెప్పే చిత్రంగా ‘పిల్ల జమిందార్‌’ మూవీకి వందకు వంద మార్కులెయ్యొచ్చు. ఇప్పటి వరకూ లెక్చరర్ అంటే యువత దృష్టిలో ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చిన చిత్రంగా ‘పిల్ల జమిందార్‌’ అని చెప్పవచ్చు. విద్యావ్యవస్థ ఇలా ఉంటే ఇక యువతరాన్ని ఎలాంటి చెడు సంస్కృతీ పక్కదోవ పట్టించలేదని సాధికారికంగా చెప్పిందీ చిత్రం.

  పిల్ల జమీందార్ మూవీ (Facebook/Photo)


  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓనమాలు’ మూవీ కూడా ఉపాయుధ్యాల గౌరవాన్ని మరింత గొప్పగా ఆవిష్కరించింది. ఒక ఊరితో టీజర్‌కు అనుబంధాన్ని ఈ మూవీ గుర్తు చేసింది.

  ‘ఓనమాలు’లో రాజేంద్ర ప్రసాద్ (facebook/Photo)


  ఈ రకంగా ఇప్పటి తరంలో అపుడపుడు కొంత మంది దర్శకులు వెండితెరపై ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:September 05, 2019, 13:55 IST

  टॉप स्टोरीज