Home /News /movies /

TEACHERS DAY 2020 TELUGU MOVIES WHICH INSULTED TEACHERS STATUS TA

Teachers Day2020: ఉపాధ్యాయుల స్థాయి తగ్గించిన తెలుగు సినిమాలు..

టీచర్స్ స్థాయిని తగ్గించిన తెలుగు సినిమాలు (Twitter/Photo)

టీచర్స్ స్థాయిని తగ్గించిన తెలుగు సినిమాలు (Twitter/Photo)

Teachers Day 2020 | 2000 సంవత్సరం తర్వాత కూడా స్కూల్, కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అనేక సినిమాలు వచ్చాయి. చాలా మంది దర్శకులు కామెడీ పండించేందుకు లెక్చరర్, ప్రిన్సిపాల్ పాత్రలతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసిన టైం కూడా ఇదే.

Teachers Day2020 | 1989లో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘శివ’ కూడా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రమే. ఈ మూవీ నుంచే తెలుగు సినిమాల్లో ఉపాధ్యాయులను తక్కువగా చూపించడం మొదలైంది. ఈ చిత్రంలో స్టూడెంట్ పాలిటిక్స్ మధ్య నడిచే మెలో డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమా ద్వారా కాలేజీ స్థాయిలో లెక్చరర్లు నిమిత్తమాత్రులని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాలోనూ క్లాస్ రూమ్ కామెడీ మెయిన్ అట్రాక్షన్. మాస్ కాపీయింగ్, లెక్చరర్‌ని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఈ కాలపు యూత్‌ పోకడలు ఈ చిత్రంలో ఎక్కువ కనిపిస్తాయి. హీరోయిజాన్ని ఎక్కువ చేయడంలో భాగంగా లెక్చరర్‌గా  ఒక కమెడియన్‌ని పెట్టి కామెడీ పండించడమనే ప్రక్రియకు ఇది పతాక స్థాయికి తీసుకువెళ్లింది. క్లాస్ రూమ్ అంటే టైంపాస్ బిర్యానీ అన్నట్లు, లెక్చరర్ నవ్వించడానికే ఉన్నట్లు చూపించిన చిత్రాల్లో ఇది ముఖ్యమైన సినిమా.

లెక్చరర్ పాత్రలను నామ మాత్రం చేసిన శివ,తమ్ముడు సినిమాలు (youtube/Credit)


2000 తర్వాత కూడా స్కూల్, కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అనేక సినిమాలు వచ్చాయి. వీటిలో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ దగ్గర నుంచీ మొదలు పెడితే ఎన్నో సినిమాలు. కానీ కొందరు దర్శకులు కామెడీ పండించేందుకు లెక్చరర్, ప్రిన్సిపాల్ పాత్రలతో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసిన టైం కూడా ఇదే. ఇందులో 2001లో విడుదలైన రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాలో మాత్రం మినహాయింపు అనే చెప్పాలి. ఈ మూవీలో కాలేజ్ లెక్చరర్లు, విద్యార్థుల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో.. ఎక్కడో పుట్టి పాట ద్వారా అద్భుతంగా చూపించారు.

స్టూడెంట్ నెం.1లో జూనియర్ ఎన్టీఆర్(facebook/Photo)


ఇదే ఏడాది విడుదలైన ‘నువ్వు నేను’ చిత్రంలో డైరెక్టర్ తేజ క్లాస్ రూమ్ మాస్ కామెడీకి తెరలేపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర ద్వారా లెక్చరర్ పాత్రను కేవలం నవ్వించడానికే పరిమితం చేసే పోకడ ఎక్కువైంది ఈ చిత్రంతోనే. తెలుగు సినిమా లెక్చరర్లకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇక్కడే.

‘నువ్వు నేను’లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, యం.యస్.నారాయణ (youtube/Photo)


2002లో వీవీ వినాయక్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆది’ సినిమాలో ప్రిన్సిపాల్ పాత్రని మలిచిన తీరుచూసి షాకయ్యారు ప్రేక్షకులు. ఆ కాసేపు హాల్లో నవ్వుకున్నా బయటికొచ్చాక.. పాపం ప్రిన్సిపాల్‌ని ఇలా చూపించకుండా ఉండాల్సిందనుకున్నారు జనాలు.

‘ఆది’ సినిమాలో లెక్చరర్ పాత్రలో నవ్వుల పాలైన ఎల్.బి.శ్రీరామ్ (Youtube/Photo)


ఇదే ఏడాది విడుదలైన ‘జయం’ సినిమాలో తేజ తనదైన స్టైల్లో మరోసారి క్లాస్ రూమ్ కామెడీకి పరాకాష్టకు తీసుకెళ్లాడు. అదే పనిగా షకీలాతో లెక్చరర్ పాత్ర చేయించి క్లాస్ రూమ్ సీన్లలో కాస్త మసాలా దట్టించడం మొదలైంది ఈ సినిమా నుంచే.

‘జయం’ మూవీలో ఉపాధ్యాయురాలి పాత్రలో షకీలా (youtube/Photo)


ఒకరకంగా చెప్పాలంటే కొత్త దర్శకులు క్లాస్ రూముల్ని, టీచర్‌ క్యారెక్టర్లని నవ్వులపాలు చేయడానికి పోటీ పడ్డారనే చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వే నువ్వే’లో లెక్చరర్ పాత్ర పగలబడి నవ్విస్తుంది. తెలుగు సినిమా లెక్చరర్లకు ఇంతకన్నా మించి గౌరవం ఇవ్వలేమన్నట్టు ఆ పాత్ర చిత్రీకరణ ఉంటుంది.

‘నువ్వే నువ్వే’ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Youtube/Credit)


2003లో వీవీ వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘దిల్’ కూడా కాలేజీ నేపథ్యంతో వచ్చిన చిత్రమే. ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ప్యూన్ పాత్రకన్నా చీపైందన్న రీతిలో చూపించడంతో పవిత్రమైన వృత్తి తెలుగు సినిమాలో మరో అడుగు కిందికి దిగజారింది. ప్రిన్సిపాల్ క్యారెక్టక్ అంటే దర్శకుడికి ప్రత్యేకమైన కోపం ఏమన్నా ఉందా అన్న అనుమానమొచ్చేలా ఆ పాత్ర కనిపించిందీ ఈ సినిమాలో.

‘దిల్’ మూవీలో ఎల్.బి.శ్రీరామ్,ఎం.ఎస్.నారాయణ (Youtube/Photo)


పెద్ద దర్శకులకే కాలేజీ కథా వస్తువైపోతే చిన్న దర్శకులు, కొత్త దర్శకులు తక్కువ తిన్నారా? సీనియర్లు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో క్లాస్ రూమ్‌ని ఓ సర్కస్‌లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. లెక్చరర్ పాత్రంటేనే  కమెడియన్‌తో యాక్ట్ చేయించడం. దీనికి కావల్సినంత మసాలా మిక్స్ చేసి కామెడీ పండించడమే ధ్యేయంగా సాగిందీ దశాబ్ధ కాల తెలుగు సిన్మాల ప్రస్థానం.ఇటీవలి కాలంలో దర్శకుల యాటిట్యూడ్ కాస్త ఛేంజ్ అయినట్టు  కనిపిస్తోంది. విద్యావంతులైన దర్శకులు ఇండస్ట్రీకి రావడమో లేక మరీ ఆటపట్టిస్తే అసలుకే మోసమనే అభిప్రాయమోకానీ.. స్క్రీన్‌పై కాలేజ్, స్టూడెంట్ సీన్లు  కాస్తంత మెరుగుపడ్డాయనే చెప్పాలి.

‘మిరపకాయ్’ సినిమాలో లెక్చరర్ స్థాయిని తగ్గించిన రవితేజ (youtube/Credit)


నవతరం హీరోల విషయానికొస్తే..రవితేజ ‘మిరపకాయ్’సినిమాలో అండర్ కవర్ కాప్‌గా లెక్చరర్‌గా నటించి ఆ పాత్ర స్థాయిని తగ్గించాడు. ఆ తర్వాత మాస్ రాజా కథానాయకుడిగా నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో ఇలియానను టీచర్ కంటే వ్యాంప్‌గా ఎక్కువగా ఫోకస్ చేయడం విశేషం.

‘ఖతర్నాక్’ మూవీలో లెక్చరర్ పాత్ర స్థాయిని తగ్గించేలా ఇలియానా నటన (youtbube/Credit)


ఈ తర్వాత ‘మజ్న’ చిత్రంలో నాని లెక్చరర్‌గా తన విద్యార్థినితో లవ్ పడటం వంటివి ఉపాథ్యాయులు గౌరవాన్ని తగ్గించింది. ఇక ‘గీత గోవిందం’ మూవీలో విజయ్ దేవరకొండ లెక్చరర్‌ పాత్రలో నటించినా..అది కామెడీకే పనికొచ్చింది.

టీచర్ పాత్ర స్థాయిని తగ్గించిన నాని, విజయ్ దేవరకొండ (youtube/Credit)


ఏది ఏమైనా గురువును గౌరవించడానికి కూడా తగిన అర్హత ఉండాలి. గురువు విలువ తెలిసిన వారు దానికి తగ్గట్లే ఆ పాత్ర చిత్రణ చేపడతారు. అది తెలియని వారి వల్లే ఈ చిక్కులు. ఇక నుంచైనా ఈ ధోరణి మారటం సమాజానిక్కూడా మంచిది. ఇకనైనా వెండితెరపై గురువులను జోకర్లుగా కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులుగా చూపెడితే బాగుంటుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Jr ntr, Nagarjuna Akkineni, Nani, Pawan kalyan, Teachers Day, Teja, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

తదుపరి వార్తలు