సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ,సినీ ప్రేక్షకులుండరు. ఏ షో చూసిన సుమదే. ఈ హిట్ సినిమా ఈవెంట్ చూసిన సుమనే. ఎలాంటి షో అయిన.. అతిథులు ఎవరైనా సరే.. ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో ఇలానే అందర్నీ ఆకట్టుకుంటోంది. సుమ మలయాళీ అయినా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లాడింది. ఆ తర్వాత తెలుగింటి కోడలై.. అనర్గగళంగా తెలుగులో మాట్లాడుతూ.. అందర్నీ అట్రాక్ట్ చేస్తుంటుంది.సుమ పంచ్‌లకు తగ్గట్టు యాంకరింగ్ చేసే యాంకర్స్ ఎవరూ తెలుగులో ఇక లేరనే చెప్పాలి.
అలాంటి టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ(Anchor Suma) ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'జయమ్మ పంచాయితీ' (Jayamma Panchayati). ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేసేందుకు మూవీ టీం రెడీ అయ్యింది. ఈ సందర్భంగా జయమ్మ టీం... ప్రమోషన్లలో బిజీగా మారింది. ఇప్పటికే జయమ్మ పంచాయతీ సినిమా ట్రైలర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పలు వ్యాఖ్యాలు చేశారు.
ఈ సినిమా ట్రైలర్ బాగుందని సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ''శ్రీకాకుళం(Srikakulam) యాసతో సినిమాలు రూపొందించడాన్ని చూసి నేను గర్వపడుతున్నా. మన భాష, సంస్కృతి చూపించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి'' అని ఆకాంక్షించారు. ట్రైలర్ చూసిన వాళ్లకు ఈ సినిమా పల్లెటూరులో జరిగిన ఓ ఘటన ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సుమతో ఈ సినిమాలో బూతులు కూడా తిట్టించారు. శ్రీకాకుళం యాసలో కొన్ని డైలాగ్స్ మనకు కనిపిస్తాయి.
సుమ మినహా దాదాపు అంతా కొత్త వాళ్ళతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) వస్తుంది. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరి వాతావరణం కనిపించనుంది. చాలాకాలం తర్వాత సుమ వెండితెరపై ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనూష్ కుమార్. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.