Home /News /movies /

TDP MLA CUM ACTOR NANDAMURI BALAKRISHNA SENSATIONAL COMMNETS ON PAWAN KALYANS JANASENA TA

రాష్ట్రంలో కొత్త పార్టీల ప్రభావం ఉండదు.. పవన్ జనసేనపై బాలయ్య సంచలనం..

పవన్ కళ్యాణ్,బాలకృష్ణ

పవన్ కళ్యాణ్,బాలకృష్ణ

హిందూపురం ప్రచారంలో భాగంగా బాలయ్య నూగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ, జనసేన పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

టాలీవుడ్ అగ్రనటుడు,టీడీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ..ప్రచారంలో భాగంగా హిందూపురం నూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య..వైసీపీ, జనసేన పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ హత్యా రాజకీయాలకు పెట్టింది పేరన్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పథకాలు, రాష్ట్ర అభివృద్దే టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని జోస్యం చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో తెలుగు దేశానికి కాకుండా మరెవరికి ఓటేసిన ఇన్ డైరెక్ట్‌గా బీజేపీకి ఓటేసినట్టేనన్నారు. హిందూపురంలో జరిగిన అభివృద్దే మళ్లీ తనను మంచి మెజారిటీతో గెలుపిస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేసారు.

TDP MLA Cum Actor Nandamuri Balakrishna Sensational Commnets on Pawan kalyan's Janasena, హిందూపురం ప్రచారంలో భాగంగా బాలయ్య నూగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ, జనసేన పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Balakrishna,Andhra pradesh pollitics,Nandamuri balakrishna,Andra Pradesh news,Balakrishna pawan kalyan,Balakrishna fires on pawan kalyan janasena,Balakrishna sensational Commnets on Pawan kalyan janasena,balakrishna Fires on ys jagan ysrcp,Pawan kalyan,Tollywood news,Telugu cinema,నందమూరి బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు,జనసేన టీడీపీ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు,వైసీపీ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ


నియోజవర్గానికి తాను ఇచ్చిన హామిలన్నింటినీ నెరవేర్చానన్నారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాన్నారు. త్వరలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పటిల్‌‌ను ఇక్కడ నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదని ఇన్ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ జనసేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు బాలయ్య ఈ రోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసారు. ఇంకోవైపు బాలయ్య పెద్దల్లుడు చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఈ రోజే ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు.

 
First published:

Tags: Balakrishna, Chandrababu naidu, Janasena party, Nara Lokesh, Pawan kalyan, Tdp, Telugu Cinema, Tollywood, Ys jagan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు