Tata Motors: టాటా మోటార్స్ కీలక నిర్ణయం... ఆ నాలుగు మోడళ్లకు బ్రేక్

Tata Motors: టాటా మోటార్స్ కీలక నిర్ణయం... ఆ నాలుగు మోడళ్లకు బ్రేక్ (ప్రతీకాత్మక చిత్రం)

Tata Motors | టాటా మోటార్స్ నెక్సాన్ మోడల్‌లో నాలుగు డీజిల్ వేరియంట్లను నిలిపివేస్తోంది. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
టాటా కార్లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. అత్యుత్తమ వాహనాలను విపణిలోకి విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోందీ సంస్థ. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లలో టాటా నెక్సాన్ మోడల్ కు మంచి పాపులారిటీ ఉంది. భారత్ లో అత్యధిక విక్రయాలు అందుకున్న కార్లలో టాటా నెక్సాన్ ముందు వరుసలో ఉంటంది. తాజాగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డీజిల్ మోడళ్లలో.. నాలుగు వేరియంట్లను కంపెనీ నిలిపివేయనుంది. టాటా నెక్సాన్ డీజిల్ వాహనంలో XE, XMA, XZ, XZA+ వేరియంట్లను టాటా మోటార్స్ నిలిపివేయనున్నట్లు ఆటోకార్ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ వేరియంట్లకు డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నెక్సాన్ వేరియంట్ల ధరలు


XE వేరియంట్ ధర-రూ.8.50 లక్షలు
XMA వేరియంట్ ధర- రూ.10.09 లక్షలు
XZ వేరియంట్ ధర- రూ.10.49 లక్షలు
XZA+(S) వేరియంట్ ధర- రూ. 11.16 లక్షలు

Insurance: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే ఇన్స్యూరెన్స్ కష్టం

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

అంతేకాకుండా డిమాండ్ తక్కువగా ఉండటంతో డీలర్లు కూడా ఈ నాలుగు వేరియంట్లకు సంబంధించిన బుకింగ్స్ కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఎక్స్ఈ వేరియంట్ నిలిపివేస్తే, ఎంట్రీలెవల్ మోడల్ గా ఎక్స్ఎం వేరియంట్ నిలుస్తుంది. దీని ధర రూ. 9.49 లక్షలు. దీని టాప్ స్పెక్ XZA+DT(O) ధర రూ.12.96 లక్షలుగా నిర్దేశించింది. ఈ నెక్సాన్ మోడల్ 1.5-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండి 110పీఎస్ పవర్, 260 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాలో రెండోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఒక్క రోజులో రూ.1,00,000 విత్‍డ్రా చేయొచ్చు ఇలా

పెట్రోల్ వేరియంట్ ధర


నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లు అయితే రివోట్రాన్ 1.2-లీటర్ టర్బోఛార్జెడ్ ఇంజిన్ ను కలిగి ఉండి 120పీఎస్ పవర్, 170 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ పెట్రోల్ వేరియంట్ల ధర రూ.7.20 లక్షల నుంచి 11.63 లక్షల మధ్య ఉంటుంది. భారత మార్కెట్లో టాటా నెక్సాన్ కు పోటీగా కియా సోనెట్, హ్యూండాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్ యవీ 300, టోయోటా అర్బన్ క్రూజర్, నిసాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ లాంటి వాహనాలు ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published: