హోమ్ /వార్తలు /సినిమా /

Nandamuri Balakrishna: నటసింహం బాలకృష్ణ బ్యాటింగ్ చేస్తే ఇట్టాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్

Nandamuri Balakrishna: నటసింహం బాలకృష్ణ బ్యాటింగ్ చేస్తే ఇట్టాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్

Balakrishna

Balakrishna

TATA IPL 2023 : స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుద‌ల చేసిన ప్రోమో ఫిల్మ్‌లో బాల‌కృష్ణ‌ త‌న‌దైన శైలిలో ఆకట్టుకున్నారు. చేత బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేస్తూ వావ్ అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుద‌ల చేసిన ప్రోమో ఫిల్మ్‌లో బాల‌కృష్ణ‌ త‌న‌దైన శైలిలో తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘ఇన్‌క్రెడిబుల్ ప్రీమియ‌ర్ లీగ్’ను వీక్షించాల‌ని కోరుతూ, క్రికెట్ మ‌రియు IPL ప‌ట్ల‌ అభిమానాన్ని ప్రోమోలో వ్య‌క్త‌ ప‌రిచారు.

NBK 108 సెట్స్‌లో తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్‌MSK ప్రసాద్ & వేణుగోపాలరావుతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్ర‌జెంటర్‌ వింధ్య అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపిన ఆయ‌న‌.. తన క్రికెట్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. మార్చ్ 31న IPL ప్రారంభ‌మై, #HusharuOnGameOn హ్యాష్‌టాగ్‌తో ముగియ‌నుంది. మార్చ్ 31న కేవ‌లం స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు HDలో మాత్ర‌మే ప్రార‌మ‌య్యే క్రికెట్ లైవ్- తొలి రోజు- తొలి షోలో తెలుగు ప్రేక్ష‌కులు బాల‌కృష్ణ‌గారి చూడొచ్చు. TATA IPL 2023 యాక్ష‌న్‌ను టెలివిజ‌న్‌లో అస్వాదించవచ్చు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులకు డిఫరెంట్ అనుభూతి ఇవ్వనుందట. బాలయ్య కోసం పదునైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్న అనిల్ రావిపూడి.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమా రూపొందిస్తారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ నటిస్తోంది.

తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుండగా.. ఆయన సరసన కాజల్ నటించనుందని అంటున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందించబోతున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేస్తున్నారట. చిత్రంలో బాలయ్యను చాలా స్పెషల్ గా చూపించబోతున్నారట. బాలయ్య ఓల్డ్ హిట్ సాంగ్ ఒకటి రీమిక్స్ చేసి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికర అంశం.

First published:

Tags: Balakrishna, Nandamuri balakrishna, Tollywood actor

ఉత్తమ కథలు