హోమ్ /వార్తలు /సినిమా /

Taraka Ratna Passed Away: తారకరత్న మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం..

Taraka Ratna Passed Away: తారకరత్న మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం..

తారకరత్న మృతిపై సీఎం కేసీఆర్, జగన్ సంతాపం (Twitter/Photo)

తారకరత్న మృతిపై సీఎం కేసీఆర్, జగన్ సంతాపం (Twitter/Photo)

Taraka Ratna Passed Away: గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈయన మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Taraka Ratna Passed Away: గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు..సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ శోక సంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా టీడీపీ, నందమూరి అభిమానులు తారకరత్న మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

డద  23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. క్షేమంగా తిరిగి వస్తాడని అనుకున్నామని.. కానీ అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని.. కంటతడి పెడుతున్నారు. తారకరత్న మాకు దూరమయ్యి.. మా కుటుంబాల్లో విషాదం నింపారని చంద్రబాబునాయుడు ఎమోషనల్ అయ్యారు. బావా అని ఆప్యాయంగా పిలిచే గొంతు ఇక వినిపించదని.. లోకేష్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్ గారు, వైయస్. జగన్మోహన్ రెడ్డిగారు తారకరత్న మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తారకరత్న మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. దీంతో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ సహా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారధులందరు తారకరత్న మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

-చంద్రబాబు నాయుడు

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం.. మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది.

-నారా లోకేశ్

తారకరత్న కన్నమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్శరుణ్ణి ప్రార్థిస్తున్నా. గత మూడు వారాలుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాం. ఆయన నటుడిగా రాణిస్తూనే.. ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరం. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

- పవన్ కల్యాణ్

తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ విధి మరోలా తలచింది.

- విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ

నందమూరి తారకరత్నకు జనవరి 27న గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పాదయాత్రలో బాగానే కనిపించిన తారకరత్న.. కొద్దిదూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.అక్కడే ఉన్న యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది ఆయన్ను హుటాహుటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. గత 23 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మహా శివరాత్రి రోజున శివైక్యం పొందడం విచారకరం.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Telangana

ఉత్తమ కథలు