Home /News /movies /

TANUSHREE DUTTA TO MAKE SHORT FILM BASED ON BOLLYWOODS SEXUAL HARASSMENT STORIES TA

#metoo:సెక్సువల్ వేధింపులపై షార్ట్ ఫిల్మ్ తీస్తున్న తనూశ్రీ దత్త..

బాలయ్య వీరభద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తను శ్రీ దత్తా.. ఆ తర్వాత మాత్రం తెలుగులో కనిపించలేదు. వన్ మూవీ వండర్ అయిపోయింది తను. మీటూ ఆరోపణలు చేస్తూ తర్వాత కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది ఈమె.

బాలయ్య వీరభద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తను శ్రీ దత్తా.. ఆ తర్వాత మాత్రం తెలుగులో కనిపించలేదు. వన్ మూవీ వండర్ అయిపోయింది తను. మీటూ ఆరోపణలు చేస్తూ తర్వాత కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది ఈమె.

బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై తనూశ్రీ దత్త చేసిన ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపుందుకుంది. ఈ ఆరోపణలతో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుండి నానా స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ భామ తనకు జరిగిన అన్యాపంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయడానికి రెడీ అవుతుంది.,

ఇంకా చదవండి ...
బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై తనూశ్రీ దత్త చేసిన ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపుందుకుంది. ఈ ఆరోపణలతో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుండి నానా స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఈ దెబ్బతో బాలీవుడ్ నటి సలోని చోప్రా కూడా ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో అతను కూడా హౌస్‌ఫుల్ దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా బాలీవుడ్‌లో జరుగుతోన్న లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్త ఓ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తోంది. దీనికి ‘ఇన్సిపిరేషన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. ఈ భామ పదేళ్ల క్రితం హీరో నానా పాటేకార్ తన పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని బయటపెట్టి సంచలనం రేకెత్తించింది. దీంతో చాలా మంది నటీమణులు తమకు జరిగిన వేధింపులపై దైర్యంగా గళమెత్తారు. మొత్తానికి ఇంత రచ్చ జరిగాక ఇపుడు తనుశ్రీ దత్త తీయబోతున్న ఈ  షార్ట్ ఫిల్మ్ బాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో చూడాలి.
First published:

Tags: Bollywood, Casting Couch, Hindi Cinema, Nana Patekar, Tanushree dutta

తదుపరి వార్తలు