#metoo: నానా కు క్లీన్ చిట్ పై పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్న తనూశ్రీ దత్తా..

ఇటీవల .. నానా పటేకర్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. దీంతో తనుశ్రీ పోలీసులపై, న్యాయవ్యవస్థపై తనదయిన శైలిలో విరుచుకుపడుతోంది.

news18-telugu
Updated: June 14, 2019, 11:34 AM IST
#metoo: నానా కు క్లీన్ చిట్ పై పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్న తనూశ్రీ దత్తా..
నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త
  • Share this:
మీటూ ఉద్యమంతో పెను దుమారం రేపిన నటి తనుశ్రీదత్తా నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే . బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై తనూశ్రీ దత్త చేసిన ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపుందుకుంది. ఈ ఆరోపణలతో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుండి నానా స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నానా పాటేకర్‌తో పాటు అప్పట్లో నానాతో యాక్ట్ చేయాల్సిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకు కోరియోగ్రాఫర్‌గా పని చేసిన గణేష్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు   చేసింది. కావాలనే అతడు నానాపటేకర్తో అభ్యంతరకరమైన డ్యాన్స్ చేయించాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది.

ఇటీవల .. నానా పటేకర్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. దీంతో తనుశ్రీ పోలీసులపై, న్యాయవ్యవస్థపై తనదయిన శైలిలో విరుచుకుపడుతోంది.
తను శ్రీ దత్త, నానా పటేకర్


ఈ విషయంలో అప్పట్లో తనుశ్రీ కి చాలామంది సెలెబ్రిటీలు అండగా నిలిచారు.  ఇటీవల .. నానా పటేకర్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. దీంతో తనుశ్రీ పోలీసులపై, న్యాయవ్యవస్థపై తనదయిన శైలిలో విరుచుకుపడుతోంది. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయని సంచలన ఆరోపణలు చేసింది.  ఈ రెండు వ్యవస్థలు అంతకంటే ఎక్కువ అవినీతిపరుడైన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు అమ్ముడు పోయారంటూ పోలీసు వ్యవస్థను దుమ్మెత్తిపోసింది. ఇదిలావుంటే తాము మాత్రం ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటుంది. కింది  కోర్టు క్లీన్ చిట్ ఇస్తే.. పై కోర్టు పోతానని చెబుతోంది తనూశ్రీ దత్తా. ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading