తనుశ్రీదత్తా ఓ లెస్బియన్... నన్ను చాలాసార్లు రేప్ చేసింది - రాఖీసావంత్

తనుశ్రీదత్తా చూడ్డానికే అమ్మాయిలా ఉంటుంది... కానీ లోపల ఉండేవన్నీ మగబుద్ధులే... ‘మీటూ’ ఉద్యమంలా ‘షీటూ’ ఉద్యమం కూడా రావాలని డిమాండ్ చేసిన రాఖీసావంత్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 26, 2018, 12:08 PM IST
తనుశ్రీదత్తా ఓ లెస్బియన్... నన్ను చాలాసార్లు రేప్ చేసింది - రాఖీసావంత్
తనుశ్రీదత్తా చూడ్డానికే అమ్మాయిలా ఉంటుంది... కానీ లోపల ఉండేవన్నీ మగబుద్ధులే... ‘మీటూ’ ఉద్యమంలా ‘షీటూ’ ఉద్యమం కూడా రావాలని డిమాండ్ చేసిన రాఖీసావంత్!
  • Share this:
బాలీవుడ్‌లో ‘మీటూ’ మూమెంట్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ, క్రీడారంగాల్లో ప్రముఖులుగా పేరొందిన వారు కూడా ‘మీటూ’ ఆరోపణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది మాత్రం హీరోయిన్ తనుశ్రీదత్తా. సీనియర్ నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనుశ్రీదత్తా చేసిన కామెంట్లు బాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేశాయి. అయితే ఈ ఆరోపణలను సెక్స్ బాంబ్ రాఖీసావంత్ ఖండించిన సంగతి తెలిసిందే. నానాపటేకర్ మీద ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయనకి మద్ధతుగా నిలుస్తూ, తనుశ్రీదత్తాను విమర్శిస్తూ వచ్చింది రాఖీ.

ఇంతకు ముందు తనుశ్రీదత్తా డ్రగ్స్ తీసుకుంటుందని, ఆమె డ్రగ్స్ తీసుకుని మత్తులో ఉన్నప్పుడు తానొచ్చి, పాట పూర్తిచేశానని ఆరోపణలు చేసిన రాఖీసావంత్... తాజాగా షాకింగ్ ఆరోపణలు చేసింది. తనుశ్రీదత్తా ఓ లెస్బియన్ అని... తనను చాలాసార్లు రేప్ చేసిందని ఆరోపించి, సంచలనం సృష్టించింది రాఖీ.

తనుశ్రీదత్తా చూడ్డానికే అమ్మాయిలా ఉంటుంది. కానీ లోపల ఉండేవన్నీ మగబుద్ధులే. ఆమె నన్ను రేప్ చేసింది. ఒక్కసారి కాదు... చాలాసార్లు నాపై అత్యాచారం చేసింది. ఓ అమ్మాయి, మరో అమ్మాయిపై రేప్ చేయడమేంటి? అనుకోకండి. సెక్షన్ 377ను ఓ సారి గుర్తుచేసుకోండి. ఓ అమ్మాయి నన్ను రేప్ చేసిందని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నా...
రాఖీసావంత్, బాలీవుడ్ నటి


గురువారం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విధంగా ఆరోపణలు చేసింది. తనుశ్రీ చేతిలో రేప్‌కి గురవ్వడం తన జీవితంలో జరిగిన అసభ్యకర సంఘటనగా అభివర్ణించిన రాఖీసావంత్... ఆ సంఘటన తర్వాత మానసికంగా ఎంతో వేదన అనుభవించానని పేర్కొంది. నిజానికి తనుశ్రీదత్తా కొన్నేళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన రాఖీ, డ్రగ్స్ తీసుకోమని బలవంత చేయడంతో ఆమెతో స్నేహం వదులుకున్నాడని తెలిపింది. ‘తనుశ్రీదత్తాకి నార్కో అనాలసిస్ పరీక్షలు జరిపితే, అన్ని నిజాలు బయటికి వస్తాయి. ఆమె మాత్రమే కాదు బాలీవుడ్‌లో చాలామంది లెస్బియన్లు ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చింది రాఖీసావంత్. ‘మీటూ’ ఉద్యమంలా ‘షీటూ’ ఉద్యమం కూడా రావాలని డిమాండ్ చేసింది రాఖీసావంత్.
First published: October 26, 2018, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading