నానాకు నార్కో అనాలసిస్ పరీక్షలు జరపాలి: తనుశ్రీ దత్త

నానా పటేకర్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలతో పాటు బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని తనుశ్రీ దత్త కోరారు

news18-telugu
Updated: October 13, 2018, 10:32 PM IST
నానాకు నార్కో అనాలసిస్ పరీక్షలు జరపాలి: తనుశ్రీ దత్త
నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త
  • Share this:
బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల అభియోగాలు చేసిన నటి తనుశ్రీ దత్త...ఆయనపై ‘మీ టూ’ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తన ఆరోపణలను తోసిపుచ్చిన నానా పటేకర్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.  ఈ మేరకు తనుశ్రీ దత్త తరఫు న్యాయవాది ముంబైలోని ఓషివార పోలీస్ స్టేషన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే నానా పటేకర్‌కు బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని తనుశ్రీ దత్త కోరారు. ఈ పరీక్షలను తాను 2008లో నటించిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రం కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీ, దర్శకుడు రాకేశ్ సారంగ్‌కు కూడా నిర్వహించాలని తనుశ్రీ దత్త కోరారు.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో తనను నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తనుశ్రీ దత్త ఆరోపించారు. విషయం తెలిసినా గణేశ్ ఆచార్య, సమీ సిద్ధిఖీ, రాకేశ్ సారంగ్‌లు మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి తనుశ్రీ దత్త ఇప్పటికే నానా పటేకర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నానా పటేకర్ తనను ఎలా లైంగిక వేధింపులకు గురిచేశారో తన ఫిర్యాదులో వివరించారు. డ్యాన్స్ నేర్పించే నెఫంతో అందరి ముందే అసభ్యకరంగా తన శరీర భాగాలను టచ్ చేసినట్లు తెలిపారు.

అయితే దనుశ్రీ దత్త చేసిన ఆరోపణలను నానా పటేకర్ తోసిపుచ్చారు.
Published by: Janardhan V
First published: October 13, 2018, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading