హోమ్ /వార్తలు /సినిమా /

Hero Nani: అప్పట్లోనే నాని అలా..! నాటి విషయాలను బయటపెట్టేసిన తనీష్

Hero Nani: అప్పట్లోనే నాని అలా..! నాటి విషయాలను బయటపెట్టేసిన తనీష్

Photo Twitter

Photo Twitter

10 Years Of MEM VAYASUKU VACHAM: తనీష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచన మేం వయసుకు వచ్చాం సినిమా వచ్చి పదేళ్లు నిండింది. నీతి టేలర్, తనీష్ జంటగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చి దశాబ్దం అవ్వడంతో.. నాటి విషయాలను తనీష్ పంచుకున్నాడు. సినిమా విడుదల సమయంలో నిర్మాత పడిన కష్టాలు, వెళ్లిపోమాకే పాటను విన్న నాని రియాక్షన్‌ల గురించి తనీష్ చెప్పుకొచ్చాడు.

ఇంకా చదవండి ...

తనీష్ (Tanish) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచన మేం వయసుకు వచ్చాం (MEM VAYASUKU VACHAM) సినిమా వచ్చి పదేళ్లు నిండింది. నీతి టేలర్, తనీష్ జంటగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చి దశాబ్దం అవ్వడంతో.. నాటి విషయాలను తనీష్ పంచుకున్నాడు. సినిమా విడుదల సమయంలో నిర్మాత పడిన కష్టాలు, వెళ్లిపోమాకే పాటను విన్న నాని (Nani) రియాక్షన్‌ల గురించి తనీష్ చెప్పుకొచ్చాడు. ‘త్రినాధ రావు నక్కిన నాకు స్క్రిప్ట్ నెరేట్ చేసిన క్షణంలోనే వెంటనే యస్ చెప్పేశాడు.. ఎందుకంటే నేను బాంబే లాంటి లవ్ స్టోరీని చేయాలని అనుకున్నా.. నాకు ఇంకా ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ డే గుర్తుంది.. ఎంతో ప్యాషనేట్ టీంతో కలిసి పని చేశాను.. అందరూ ఎంతో నమ్మకంగా ఈ సినిమా కోసం పని చేశారు.

వెళ్లిపోకే పాటను శేఖర్ చంద్ర గారు వినిపించిన ఆ సాయంత్రం నాకు ఇంకా గుర్తుంది.. ఆ పాట విన్న వెంటనే నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి.. నాని అన్నకు ఆ సాంగ్ వినిపించిన వెంటనే.. నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్ అవుతుందని అన్నాడు.. పెళ్లి సీన్ తరువాత ఈ పాటను తెరకెక్కించిన తరువాత అందరూ ఎంతో ప్రశంసించారు. ఓల్డ్ సిటీలో ఆ పాటను తెరకెక్కించిన తరువాత అక్కడ వారంతా కూడా ఎంతో ప్రశంసించారు.

నిర్మాత బెక్కెం వేణు గోపాల్ సినిమా విడుదలకు ముందు రాత్రి కూడా ఎంత కష్టపడ్డారో నాకు గుర్తుంది.. బాక్సులను పంపించేందుకు చివరి వరకు ఎంత కష్టపడ్డారో నాకు తె లుసు.. ఆయన ఎంత చేయాలో అంత చేశారు.. మా కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్ సినిమా అయిందని, సినిమాకు హిట్ టాక్ వచ్చిందని, కొన్ని ఏరియాల్లో వంద రోజులు ఆడిందని తెలిశాక మేం ఎంతో సంతోషించాం..


బెక్కెం వేణు గోపాల్, త్రినాథ్ రావునక్కినలకు నేను ఎంతో రుణపడి ఉంటాను.. నీతి టేలర్ లేకపోతే ఇదంతా జరిగేది కాదు.. సాయి శ్రీరామ్ తెరకెక్కించిన విధానం, క్యాప్చర్ చేసిన విధానం ఎంతో గొప్పగా ఉంది.. వెళ్లిపోకే సాంగ్ ఇచ్చినందుకు శేఖర్ చంద్ర, పాటను రాసిన భాస్కర భట్లకు థ్యాంక్స్.. ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఈ సినిమాను ఇంత బాగా ఆదరించిన అందరికీ థ్యాంక్స్’ అని తనీష్ అన్నాడు.

First published:

Tags: Hero nani, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు