• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TANIKELLA BHARANI TO DO MITHUNAM REMAKE WITH AMITABH BACHCHAN AND REKHA MHN

Amitab Bacchan - Tanikella Bharani: అమితాబ్ - రేఖ‌ను క‌లిపే బాధ్య‌త భ‌ర‌ణిదేనా!

Amitab Bacchan - Tanikella Bharani: అమితాబ్ - రేఖ‌ను క‌లిపే బాధ్య‌త భ‌ర‌ణిదేనా!

Tanikella Bharani to do Mithunam remake with Amitabh Bachchan and Rekha

Amitab Bacchan - Tanikella Bharani: నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకూ ఆయన అమితాబ్ తో చేయబోయే సినిమా ఏదంటే..

  • Share this:
    అమితాబ్ బ‌చ్చ‌న్ - రేఖను క‌లిపే బాధ్య‌త‌ను భ‌ర‌ణి తీసుకున్నారా? బిగ్ బీ , రేఖ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్ ఓపెన్ సీక్రెట్‌. వాళ్లిద్ద‌రిదీ తెర మీద కూడా హిట్ పెయిర్‌. నిజ జీవితంలోనూ వారి గురించి చాలా గుస‌గుస‌లే వినిపిస్తుంటాయి. దూరంగా ఉన్న వారిద్ద‌రినీ క‌లిపి ప్రేక్ష‌కుల‌కు క‌నుల‌విందు చేసే బాధ్య‌త‌ను త‌నికెళ్ల భ‌ర‌ణి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
    అయితే అది ప‌ర్స‌నల్ జీవితంలో కాదు. ప్రొఫెష‌న‌ల్‌గానే! అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా, రేఖ హీరోయిన్‌గా ఓ సినిమా తీయ‌డానికి త‌నికెళ్ల భ‌ర‌ణి కృషి చేస్తున్నారు. ఈ సినిమా క‌థ కూడా ఆల్రెడీ ఫిక్స‌యిపోయింది. తెలుగులో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ల‌క్ష్మి క‌లిసి చేసిన మిథునం క‌థ‌ను హిందీలో వారిద్ద‌రితో చేయాల‌న్న‌ది త‌నికెళ్ల భ‌ర‌ణి ఆరేళ్ల‌నాటి క‌ల అట‌. అప్పుడే స్క్రీన్ మీద‌కు రావాల్సిన ఈ క‌థ‌, ఇప్పుడు ప‌ట్టాలెక్కే ఛాన్సులే క‌నిపిస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ సంస్థ నిర్మాణానికి కూడా ఒప్పుకున్న‌ట్టు ఈ మ‌ధ్య ఓ టాక్ షోలో త‌నికెళ్ల భ‌ర‌ణి స్వ‌యంగా చెప్పారు.
    సో హిందీ వాళ్ల సినిమా అంటే క‌చ్చితంగా చాలా స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి, ఇంత‌లో రాఘ‌వేంద్ర‌రావు హీరోగా తెర‌కెక్కే సినిమా ప‌నుల‌న్నీ పూర్తి చేయ‌వ‌చ్చ‌న్న‌ది ఆయ‌న మాట‌.

    bharani, tanikella bharani, writer tanikella bharani, director tanikella bharani, tanikella bharani bollywood movie, midhunam movie, midhunam reamke in bollywwod, tanikella bharani movie with amitab bacchan, tanikella bharani movie with ravi, అమితాబ్ బచ్చన్, రేఖ, తనికెళ్ల భరణి
    Tanikella Bharani to do Mithunam remake with Amitabh Bachchan and Rekha


    తెలుగులో రాఘ‌వేంద్ర‌రావు, హిందీలో అమితాబ్‌... వీరిద్ద‌రితో వెంట‌వెంట‌నే సినిమా చేయాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని, శ‌తాధిక చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాఘ‌వేంద్ర‌రావుకు ద‌ర్శ‌కుడిగా తాను సెట్లో ఉంటాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని అంటారు త‌నికెళ్ల భ‌ర‌ణి.
    సింగిల్ టేక్‌లోనే త‌న యాక్టింగ్‌ను యాక్సెప్ట్ చేయాల‌నే ష‌ర‌తుతోనే రాఘ‌వేంద్ర‌రావు క‌థ‌ను ఓకే చేశార‌ని స‌ర‌దాగా ఆ షోలో చెప్పుకున్నారు త‌నికెళ్ల భ‌ర‌ణి. మ‌రి హిందీలో అమితాబ్ ఎలాంటి కండిష‌న్లూ పెట్ట‌క‌పోయినా, రేఖా మేడ‌మ్ ఎన్ని కండిష‌న్స్ అప్లై అంటారో, వాటికి త‌నికెళ్ల భ‌ర‌ణి ఏమంటారో చూడాలి.
    Published by:Anil
    First published: