Tandav Web Series Controversy: సైఫ్ అలీ ఖాన్ వివాదాస్పద ‘తాండవ్’ వెబ్ సిరీస్‌పై కేసు నమోదు..

సైఫ్ అలీ ఖాన్ ‘తాండవ్’ వెబ్ సిరీస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు (Twitter/Photo)

 • Share this:
  Tandav Web Series Controversy: గత కొంత కాలంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. దీంతో దర్శక, నిర్మాతలు ఎవరి మనోభావాలను పట్టించుకోకుండా.. తమకు తోచింది తోచినట్టుగా తెరకెక్కిస్తుండంతో అవి వివాదాస్పద మవుతున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రలో నటించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ సిరీస్‌ ఉందని కొంత మంది  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్  ఫిర్యాదు చేసారు. దీంతో ‘తాండవ్’ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శించడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ వివరణ కోరింది.

  తాజాగా ఈ వెబ్ సిరీస్‌లో హిందువుల మనోభావాలను గాయపరిచేలా  హిందు దేవీ, దేవతలను కించపరిచేలా సన్నివేశాలున్నాయన్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ సినిమా దర్శక, నిర్మాతలైన అలీ అబ్బాస్ జఫర్‌తో పాటు.. వెబ్ సిరీస్ నిర్మాత హిమాంన్షు మెహ్రాతో పాటు రైటర్ గౌరవ్ సోలంకితో పాటు అమెజాన్ ఇండియా ఒరిజినల్ కంటెంట్ హెడ్ అపర్ణా పురోహిత్‌‌తో పాటు పలువురిపై  ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

  తాండవ్ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్ (Twitter/Photo)


  ఇక కేంద్రం కూడా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్ సిరీస్‌లపై సెన్సార్ షిప్ ఉండాలంటే ఓ చట్టం చేయాలనే ఆలోచనలో ఉంది.అంతేకాదు ఓటీటీ కంటెంట్ లపై సెన్సార్ షిప్ ఉండలంటూ ఎంపీ మనోజ్ కోటక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాండవ్ వెబ్ సిరీస్ కాంట్రవర్సీ నేపథ్యంలో ఇందులో ముఖ్యపాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు. అంతేకాదు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తాండవ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. సెక్స్, హింస రెచ్చగొట్టేలా ఉన్న ఈ వెబ్ సిరీస్‌‌కు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. పూర్తి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గతంలో సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘సాక్రేడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌ కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే కదా. ఈ వెబ్ సిరీస్ పై అప్పట్లో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: