చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం చేస్తున్నాడా.. తమ్మారెడ్డి సీరియస్..

Chiranjeevi Balakrishna: రెండు మూడు రోజులుగా తెలుగులో ఇండస్ట్రీలో బాలకృష్ణ, నాగబాబు వివాదం నడుస్తూనే ఉంది. ఇండస్ట్రీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా నాగబాబు కూడా సెటైర్లు వేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2020, 3:03 PM IST
చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం చేస్తున్నాడా.. తమ్మారెడ్డి సీరియస్..
చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/tammareddy bharadwaj chiranjeevi)
  • Share this:
రెండు మూడు రోజులుగా తెలుగులో ఇండస్ట్రీలో బాలకృష్ణ, నాగబాబు వివాదం నడుస్తూనే ఉంది. ఇండస్ట్రీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా నాగబాబు కూడా సెటైర్లు వేసాడు. అయితే ఈ ఇద్దరిపై కూడా కొందరు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అలా మాట్లాడితే ఇక పెద్దోళ్లుండి ఏం లాభం అంటూ కొందరు నాగబాబు, బాలయ్యపై మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే దాసరి వర్ధంతి వేడుకలలో భాగంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేసాడు. అందులో బాలకృష్ణ, నాగబాబు వివాదం కూడా ఉంది. ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పాడు తమ్మారెడ్డి.
నాగబాబు బాలయ్య వార్ (naga babu balakrishna)
నాగబాబు బాలయ్య వార్ (naga babu balakrishna)


చిరంజీవి ఇంట్లో మీటింగ్ గురించి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారనేది తనకు అర్థం కావడం లేదని చెప్పాడు ఈయన. దాసరి ఉన్నపుడు ఈయన ఇంట్లో ఎన్నోసార్లు మీటింగ్స్ జరిగాయి. అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు.. మరిప్పుడు ఎందుకు చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఉలిక్కిపడుతున్నారనేది అర్థం కావడం లేదని చెప్పాడు భరద్వాజ్.
చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/tammareddy bharadwaj chiranjeevi)
చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/tammareddy bharadwaj chiranjeevi)

చిరంజీవి ఏమైనా స్వలాభం కోసం పెట్టాడా లేదు కదా.. ఆయన కూడా ఇండస్ట్రీ కోసమే కదా పెట్టాడు.. మరి అలాంటప్పుడు బాలకృష్ణ అనని మాటల్ని కూడా అన్నారని చూపిస్తున్నారు.. ఆయన వ్యక్తిగతంగా అన్న మాటలపై తాను స్పందించను కానీ.. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చాలా స్నేహంగా ఉన్నారు.. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడాము.. ఈ సమస్యకు అక్కడే పరిష్కారం దొరికిందని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు ఈయన. ఇండస్ట్రీకి మంచి జరుగుతుందనుకుంటే చిరంజీవే కాదు ఎవ్వరితోనైనా కలసి కడవడానికి అంతా సిద్ధంగానే ఉన్నారని చెప్పుకొచ్చాడు తమ్మారెడ్డి.
Published by: Praveen Kumar Vadla
First published: May 30, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading