‘సైరా’ కలెక్షన్స్ విషయంలో తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

‘సైరా’ సినిమాపై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమం ద్వారా తన రాజకీయ , సినిమా అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు.

  • Share this:
    ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమం ద్వారా తన రాజకీయ , సినిమా అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. గతంలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ ‌ను గొప్ప స్థాయిలో ఉన్న చిరంజీవి చేయడం ఏమిటి అంటూ  తమ్మారెడ్డి భరద్వాజ ఓ రేంజ్‌లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా. దీనిపై మెగా ఫ్యాన్స్ తమ్మారెడ్డిపై ఫైర్ అయ్యారు. తాజాగా సైరా సినిమాను ‘సాహో’‘బాహుబలి’ సినిమాలతో పోలుస్తూ.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా. .రూ.300 కోట్లు, రూ.500 కోట్లు, వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు వసూలు చేయాలంటూ కొంచెం వెటకారంగా మాట్లాడారు.    ఈ వీడియోలో ఎక్కడ కథ, కథనం, చిరు నటన, ఫోటోగ్రఫీ గురించి కాకుండా కేవలం కలెక్షన్స్ గురించే మాట్లాడాన్ని మెగా భిమానులు తప్పు పడుతున్నారు. ఏమైనా తమ్మారెడ్డి సడెన్‌గా చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.
    First published: