చిరంజీవిని అలా అనడం కామెడీనే... సీనియర్ దర్శకనిర్మాత కామెంట్

చిరంజీవిపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Updated: October 25, 2019, 3:02 PM IST
చిరంజీవిని అలా అనడం కామెడీనే... సీనియర్ దర్శకనిర్మాత కామెంట్
మెగాస్టార్ చిరంజీవి
  • Share this:
ఏ విషయంలో అయినా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చేసే వారిలో టాలీవుడ్ సీనియర్ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ముందుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది. సైరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సీఎం జగన్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన చిరంజీవిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయనకు వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వనుందని... దాసరి స్థానం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారనే పుకార్లు షికారు చేశాయి. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ వార్తలు వింటుంటే... తనకు కామెడీ అనిపిసోందని ఆయన కామెంట్ చేశారు.

ప్రముఖుల వద్దకు వెళ్లి తన తాజా చిత్రమైన సైరాను చిరంజీవి చూపించటం వెనుక అసలు కారణం దాసరి స్థానం దక్కించుకునేందుకు అంటూ వినిపిస్తున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి అనుకోవాలే కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఏ ప్లేస్ పెద్దది కాదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆయన తలుచుకుంటే ఏ స్థానాన్ని అయినా తీసుకోవచ్చని అన్నారు. అసలు దాసరి పొజిషన్ అధికారిక పదవి ఎంతమాత్రం కాదని... ఆయన పెద్దమనిషిగా వ్యవహరించేవారని అన్నారు. అలాంటి చిరంజీవి ఏదో పదవి కోసం సీఎం జగన్ దగ్గరకు వెళ్లారని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవిని సోషల్ మీడియా పిచ్చి పిచ్చిగా వాడుకోవటంపై ఆయన ఫైర్ అయ్యారు.

First published: October 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading