Tamannaah Bhatia : తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అవ్వడంతో ఇంటికే పరిమితమైన తమన్నా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తమన్నా తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో (2013) హిందీలో నటించిన ఓ సినిమా తన హిందీ సినీ కెరీర్‌ను దెబ్బకొట్టిందని పేర్కోంది. తమన్నా హీరోయిన్గా హిందీలో అడుగుపెట్టిన చిత్రం ‘హిమ్మత్వాలా’. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా గురించి తమన్నా మాట్లాడుతూ.. ఆ సినిమా తన సినీ కెరీర్‌పై చాలా ప్రభావం చూపించిందని పేర్కోంది. అయినా సరే ఆ సినిమా పరాజయం అనేది ఏదో ఒక రకంగా మంచికే అనుకుంటున్నాను. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను.. ఎందుకంటే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలని ఈ సినిమా ఫలితం వల్ల అర్థమైందని తెలిపింది. తమన్నా ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.