జయలలిత బయోపిక్‌కు కొబ్బరికాయ కొట్టిన కంగనా.. ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్రనటుడు..

ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

news18-telugu
Updated: November 10, 2019, 8:53 PM IST
జయలలిత బయోపిక్‌కు కొబ్బరికాయ కొట్టిన కంగనా.. ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్రనటుడు..
జయలలిత పాత్రలో కంగనా రనౌత్ (twitter/Photo)
  • Share this:
ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు నాలుగు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి.తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలతో చైన్నైలో ఆదివారం ఉదయం ప్రారంభం అయినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు.ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు.


‘తలైవి’ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ  సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా  తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు.

Shocking News.. Kangana Ranaut to get Huge Remuneration for Jayalalithaa biopic Thalaivi,ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..,jayalalithaa,jayalalithaa biopic,jayalalithaa kanagana ranaut,kangana ranaut as jayalalithaa,kangana ranaut Thalaivi jayalalithaa,kangana remuneration,kangana ranaut as jayalalithaa,actor turned politician jayalalithaa,late tamil nadu cm jayalalithaa kangana ranaut,Tamilnadu Politics,Tamil cinema,Andhra Pradesh News,Andhra pradesh Politics,కంగనా రనౌత్,జయలలిత బయోపిక్,తలైవి,జయలలిత కంగనా రనౌత్ తలైవి,కంగనా రెమ్యునరేషన్,కంగనా పారితోషకం,తమిళ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ న్యూస్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్,జయలలిత పాత్రలో కంగనా రనౌత్,కంగనా రనౌత్,మణికర్ణిక,విజయేంద్ర ప్రసాద్,కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విబ్రి మీడియా విష్ణువర్ధన్ ఇందూరి
తలైవి ఫస్ట్ లుక్
జయలలిత విషయానికొస్తే..  తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం కంగనా బరువు పెరిగే పనిలో పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ప్రముఖ టాలీవుడ్ అగ్ర నటుడు నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు శోభన్ బాబు పాత్ర కోసం మరో స్టార్ నటుడ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 10, 2019, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading