• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TAMIL TV ACTRESS VJ CHITRA DEATH CHENNAI POLICE CONFIRMS SUICIDE BUT FAMILY MEMBERS ALLEGES SON IN LAW HEMANTH VIOLENCE PK

VJ Chitra suicide case: తమిళ నటి VJ చిత్ర ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు..

VJ Chitra suicide case: తమిళ నటి VJ చిత్ర ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు..

తమిళ నటి విజే చిత్ర (VJ Chitra/instagram)

VJ Chitra suicide case: తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి విజే చిత్ర ఆత్మహత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె డిసెంబర్ 9 ఉదయం 2.30 నిమిషాలకు చెన్నైలోని..

  • Share this:
తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి విజే చిత్ర ఆత్మహత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె డిసెంబర్ 9 ఉదయం 2.30 నిమిషాలకు చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఆత్మహత్య చేసుకుంది. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఆమె ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడంపై ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురుది ఆత్మహత్య కాదని.. కాబోయే అల్లుడు హేమంత్ చంపేసాడని వాళ్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య జరిగిన రూమ్‌ను బాగా పరిశీలించిన తర్వాత హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. చిత్ర ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయిందని వాళ్లు ప్రాథమిక విచారణలో తెలిపారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇది కచ్చితంగా హత్యే అంటున్నారు. దానికి తోడు కాబోయే అల్లుడు తన కూతురుని కొట్టి చంపేసాడని ఆరోపిస్తుంది విజే చిత్ర తల్లి విజయ.
vj chitra suicide alleges murdered by son in law,serial actress chitra death,vijay tv chithra sucide,pandian stores serial actress chitra,vj chitra vijay tv death,vj chitra vijay tv,famous serial actress chitra,vj chitra murder,tamil actress-vj chithra dies by suicide; found dead at a hotel room,tamil tv actress chithra commits suicide,vj chithra sucide dead news,విజే చిత్ర ఆత్మహత్య,విజే చిత్ర ఆత్మహత్యకు కారణాలు
తమిళ నటి విజే చిత్ర (VJ Chitra/instagram)

చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా తాను షూటింగ్‌లో ఉన్నాను.. రావడానికి లేట్ అవుతుందని చెప్పిన తన కూతురు.. పొద్దున్న వరకు ఎలా చనిపోతుందని ఆమె ప్రశ్నిస్తుంది. ఉదయమే హేమంత్ ఫోన్ చేసి చిత్ర చనిపోయిన విషయం తెలిపాడని ఆమె చెబుతుంది. తమకు అతడిపైనే అనుమానాలు ఉన్నాయంటున్నారు వాళ్లు. ఆగస్టులో హేమంత్, చిత్ర నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరూ ఒకేచోట కలిసి ఉంటున్నారు కూడా. ఫిబ్రవరి 2021లో రిజిష్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోడానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంతలోనే ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది చిత్ర.
vj chitra suicide alleges murdered by son in law,serial actress chitra death,vijay tv chithra sucide,pandian stores serial actress chitra,vj chitra vijay tv death,vj chitra vijay tv,famous serial actress chitra,vj chitra murder,tamil actress-vj chithra dies by suicide; found dead at a hotel room,tamil tv actress chithra commits suicide,vj chithra sucide dead news,విజే చిత్ర ఆత్మహత్య,విజే చిత్ర ఆత్మహత్యకు కారణాలు
తమిళ నటి విజే చిత్ర (VJ Chitra/instagram)

ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌తో బిజీగా ఉంది. అందులో ముల్లై పాత్రతో చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు 2013 నుంచి ఇప్పటి వరకు బుల్లితెరపై స్టార్‌గా వెలిగిపోయింది చిత్ర. ఈమె మరణాన్ని ఇప్పటికీ అభిమానులు నమ్మలేకపోతున్నారు. అయితే ఈమె ఆత్మహత్యకు అసలైన కారణాలు ఇంకా బయటికి రావడం లేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం హత్యే అంటున్నారు. దీనిపై చెన్నై పోలీసులు మాట్లాడుతూ అవసరం అయితే తదుపరి విచారణకు ఆదేశం ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికి మాత్రం తమ విచారణలో చిత్రది కచ్చితంగా ఆత్మహత్యే అంటున్నారు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన నిజాలు బయటికి వస్తాయో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు