విడాకులు తీసుకున్న హీరోయిన్.. సహ నటుడితో ప్రేమాయణం..?

ఈ రోజుల్లో కలిసున్నంత సేపు పట్టడం లేదు విడిపోవడానికి. ముఖ్యంగా సినిమా వాళ్లైతే మరీ దారుణం. వాళ్లెప్పుడు కలుస్తారో.. ఎప్పుడు విడిపోతారో కూడా అర్థం కావడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2020, 8:03 PM IST
విడాకులు తీసుకున్న హీరోయిన్.. సహ నటుడితో ప్రేమాయణం..?
నటి మేఘన విడాకులు (meghana vincent divorce)
  • Share this:
ఈ రోజుల్లో కలిసున్నంత సేపు పట్టడం లేదు విడిపోవడానికి. ముఖ్యంగా సినిమా వాళ్లైతే మరీ దారుణం. వాళ్లెప్పుడు కలుస్తారో.. ఎప్పుడు విడిపోతారో కూడా అర్థం కావడం లేదు. కొన్నేళ్లు కలిసున్న తర్వాత కూడా ఒకర్నొకరు అర్థం చేసుకోలేక విడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. తాజాగా మరో జంట కూడా విడాకులు తీసుకుంది. మలయాళంతో పాటు తమిళ సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువైన నటి మేఘన వైవాహిక జీవితం ఇప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోయింది. విడాకులు తీసుకుంది ఈ నటి. చందనమాళ సీరియల్‌తో ఫేమస్ అయిన మేఘన.. 2017లో డాన్ టోమీని పెళ్లి చేసుకుంది.
నటి మేఘన విడాకులు (meghana vincent divorce)
నటి మేఘన విడాకులు (meghana vincent divorce)


ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే భర్తతో విడాకులు తీసుకుందని ప్రచారం జరుగుతుంది. వారం రోజుల కిందే ఈ తంతు పూర్తైపోయిందని తెలుస్తుంది. తమిళనాట అవలుమ్ నానుమ్‌, సోలోమాన్, పొన్మాగల్ వందాల్, దేవమ్ తందా వీడు లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మేఘన. అయితే పెళ్లి తర్వాత మాత్రం నటనకు దూరంగా ఉంది ఈమె. కానీ ఇప్పుడు భర్తతో విడిపోవడంతో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది మేఘన.
నటి మేఘన విడాకులు (meghana vincent divorce)
నటి మేఘన విడాకులు (meghana vincent divorce)

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ.. రెండేళ్ళకే విడిపోయారు. ఇప్పటికే ఏడాదిగా విడివిడిగానే ఉంటున్నారని తెలుస్తుంది. మేఘన మాజీ భర్త కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మేఘన కూడా పొన్మాగల్ వందాల్ సీరియల్‌లో తనతో పాటు నటించిన విక్కీతో ప్రేమాయణం నడుపుతోందని.. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతోన్నట్టు వార్తలు అయితే బాగానే వినిపిస్తున్నాయి. మాజీ భర్తతో విడిపోవడానికి కారణం కూడా విక్కీనే అని తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 4, 2020, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading