భార్యను కొట్టిన టీవీ నటుడు... అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ఆమె గాయాలతో ఓ ఆసుపత్రిలో చేరింది. భర్తపై మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

  • Share this:
    తన భార్యను దారుణంగా హింసించి కొట్టిన ఓ టీవీ నటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళ్తే... తమిళ టీవీ నటుడు ఐశ్వర్ రఘునాథన్ .. అతని భార్య జయశ్రీ డాన్స్ మాస్టర్. వీరిద్దరూ చెన్నైలోని తిరువాన్మయూర్, ఎల్‌బీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం, జయశ్రీకి చెందిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను తీసుకున్న ఐశ్వర్‌, వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులు తిరిగి కట్టి, పత్రాలను వెనక్కు తెచ్చే విషయంలో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు అవుతుండేవి., ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరూ ఇదే విషయంపై గొడవ పడ్డారు. తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆగ్రహం పట్టలేకపోయిన ఐశ్వర్, తన భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో ఆమె గాయాలతో అడయార్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేరింది. భర్తపై మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేసి, ఐశ్వర్‌ రఘునాథన్‌ ను, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: