తాజాగా #Prayfornesamani హ్యాష్ ట్యాగ్‌తో ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. మే 30వ తేదిన తమిళ సినిమా ‘ఫ్రెండ్స్’ లో వడివేలు క్యారెక్టర్ ‘నేసమణికి సంబంధించి ‘Pray for Nesamani’ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నడిచింది. 18 ఏళ్ల తర్వాత తన క్యారెక్టర్ అందరి దృష్టికి రావడంతో ఆనందంగా ఉందన్నారు. తన పాత్రకు వచ్చిన ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు సిద్దిఖీకి దక్కుతుందన్నాడు నటుడు వడివేలు. ఆయన తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ అంతా బాగా పండిందన్నారు. ఈ సందర్భంగా షూటింగ్ నిలిచిపోయిన తన ‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమా గురించి ప్రస్తావించారు. గతంలో ‘ఇంసై అరసన్ 23 ఏఎం పులికేసి’సినిమాను తెలుగులో ‘హింసించే 23వ రాజు పులకేశి’గా తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ.. తమిళ నిర్మాతల సంఘం నా కెరీర్‌ను నాశనం చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. అంతేకాదు నాకు సినిమాలు దక్కకుండా చేసి తన కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. నేను ఈసినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాను. నా ప్రమేయం లేకుండా వారు ఈ సినిమాను కంప్లీట్ చేయలేరు. వారు నాకు స్వేచ్ఛగా నా నుంచి యాక్టింగ్‌ను రాబట్టుకోవడం లేదు. మీకు తెలుసు.. మే 30న ‘నేసమణి’ పాత్ర ట్రెండ్ అయింది. దేశం మొత్తం దాని గురించే చర్చించుకున్నారు. దీని గురించి అందరు మాట్లాడుకోవడదానికి కారణం ఆ దర్శకుడు తనకు స్వేచ్ఛ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ అంతా బాగా పండిందన్నారు.
కానీ ఈసినిమాలో మాత్రం మరొకరు నన్ను బలవంతంగా వెనక నుంచి ముందుకు తోస్తుంటే నేనెలా నటించగలను అంటూ ప్రశ్నిస్తున్నాడు వడివేలు. ‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమాకు శింబు దేవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. క్రియేటివిటీ విషయంలో దర్శకుడికి, వడివేలుకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సమస్య తలెత్తి సినిమా ఆగిపోయింది.
దీంతో చిత్ర నిర్మాతలు ఈ ఇష్యూను నిర్మాతల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనను ఉద్దేశిస్తూ వడివేలు ఒకింత ఆవేశంతో మాట్లాడారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత నేసమణి హ్యాష్‌ట్యాగ్‌తోె వడివేలు మరోసారి వార్తల్లో నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #prayfornesamani, Lok sabha election results, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi, Vadivelu