సిక్స్‌ప్యాక్‌తో పిచ్చెక్కించిన క‌మెడియ‌న్.. సునీల్ త‌ర్వాత ఆయ‌నే..!

క‌మెడియ‌న్లే క‌దా అని లైట్ తీసుకుంటే ఇప్పుడు హీరోల‌కు కూడా ఎర్త్ పెట్టేస్తున్నారు వాళ్లు. ఇప్పుడు క‌మెడియ‌న్లు కూడా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకోవ‌డ‌మే కాదు.. స‌త్తా చూపిస్తున్నారు కూడా. హీరోల‌కు త‌క్కువ కాని క్రేజ్‌తో కుమ్మేస్తున్నారు. త‌మిళ టాప్ క‌మెడియ‌న్ సూరి కూడా ఇప్పుడు ర‌చ్చ చేసాడు.

news18-telugu
Updated: September 12, 2018, 11:08 PM IST
సిక్స్‌ప్యాక్‌తో పిచ్చెక్కించిన క‌మెడియ‌న్.. సునీల్ త‌ర్వాత ఆయ‌నే..!
సూరి ట్విట్టర్ ఫోటో
  • Share this:
క‌మెడియ‌న్లే క‌దా అని లైట్ తీసుకుంటే ఇప్పుడు హీరోల‌కు కూడా ఎర్త్ పెట్టేస్తున్నారు వాళ్లు. ఇప్పుడు క‌మెడియ‌న్లు కూడా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకోవ‌డ‌మే కాదు.. స‌త్తా చూపిస్తున్నారు కూడా. హీరోల‌కు త‌క్కువ కాని క్రేజ్‌తో కుమ్మేస్తున్నారు. త‌మిళ టాప్ క‌మెడియ‌న్ సూరి కూడా ఇప్పుడు ర‌చ్చ చేసాడు. ఈయ‌న కూడా సిక్స్‌ప్యాక్ చేసి చూపించాడు. ఈయ‌న బాడీ చూసి హీరోలు కూడా కుళ్లుకుంటున్నారు.

శివ‌కార్తికేయ‌న్ అయితే చూడండి.. మా మాస్ సూరిని అంటూ సిక్స్‌ప్యాక్ లుక్ విడుద‌ల చేసాడు. ఈయ‌న‌తోనే ఎక్కువ సినిమాలు చేసాడు సూరి. ఇప్పుడు విడుద‌ల‌వుతున్న ప్ర‌తీ సినిమాలోనూ సూరి లేకుండా ఉండ‌డు. అక్క‌డ సంతానం హీరో అయిన త‌ర్వాత సూరి టాప్ క‌మెడియన్ అయిపోయాడు. ఇక ఇప్పుడు సూరి కూడా హీరోగా మారుతున్నాడు. అందుకోస‌మే ఎనిమిది నెల‌లు క‌ష్ట‌ప‌డి సిక్స్‌ప్యాక్ చేసి చూపించాడు. మ‌న ద‌గ్గ‌ర సునీల్ కూడా ఇలాగే ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి సిక్స్‌ప్యాక్ చేసాడు.సిక్స్‌ప్యాక్‌తో పిచ్చెక్కించిన క‌మెడియ‌న్.. సునీల్ త‌ర్వాత ఆయ‌నే..! tamil top comedian soori six pack.. after sunil..
సునీల్ సూరి న్యూస్18


ఒక‌ప్ప‌ట్లా క‌మెడియ‌న్లే క‌దా అని చీప్‌గా తీసుకుంటే అంతే సంగ‌తులు. వాళ్లు త‌లుచుకుంటే హీరోలు కూడా సిగ్గు ప‌డేలా చేస్తార‌ని అప్పుడు సునీల్.. ఇప్పుడు సూరి నిరూపించారు. సునీల్ మ‌ళ్లీ ఇప్పుడు క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అక్క‌డ సంతానం మాత్రం ఇప్ప‌టికీ హీరోగానే కుమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న‌కు తోడు సూరి కూడా వ‌స్తున్నాడు. ఈయ‌న హార్డ్‌వ‌ర్క్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి సూరి సిక్స్‌ప్యాక్ ఇప్పుడు త‌మిళ‌నాట సంచ‌ల‌నం.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...