‘సైరా’ కోసం రజినీకాంత్‌ను రంగంలోకి దింపనున్న రామ్ చరణ్.. ?

ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ టీజర్‌ను రజినీకాంత్ చేతులు మీదుగా రిలీజ్ చేయనున్నారు.

news18-telugu
Updated: August 14, 2019, 8:01 PM IST
‘సైరా’ కోసం రజినీకాంత్‌ను రంగంలోకి దింపనున్న రామ్ చరణ్.. ?
రజినీకాంత్ చేతులు మీదుగా సైరా టీజర్ విడుదల
  • Share this:
ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులను ఈ సినిమాలో తీసుకున్నారు.

Uyyalawada Narasimha Reddy real life story and here why Chiranjeevi so interested on this subject pk సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు.. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,chiranjeevi sye raa,sye raa twitter,sye raa instagram,ram charan instagram,sye raa movie twitter,chiranjeevi Uyyalawada narasimha reddy,chiranjeevi sye raa,uyyalawada Narasimha Reddy real life story,uyyalawada real life story,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,ఉయ్యాలవాడ జీవిత కథ,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,తెలుగు సినిమా,చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
సైరా పోస్టర్ (Source: Facebook)


తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ తమిళ వెర్షన్ టీజర్‌ను రజినీకాంత్‌తో రిలీజ్ చేయించాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం. అలాగే హిందీ వెర్షన్‌ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు తమిళం, మలయాళంలో ఆయా భాషలకు చెందిన టాప్ స్టార్స్‌తో విడుదల చేయనున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 14, 2019, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading