అజిత్‌కు యాక్సిడెంట్.. కంగారు పడుతున్న అభిమానులు..

Ajith Accident: తమిళ సూపర్ స్టార్ అజిత్ గాయాలపాలయ్యాడు. షూటింగ్ చేస్తుండగా ఈయనకు యాక్సిడెంట్ అయింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ అది చిన్నదే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2020, 8:21 PM IST
అజిత్‌కు యాక్సిడెంట్.. కంగారు పడుతున్న అభిమానులు..
అజిత్: 35 కోట్లు
  • Share this:
తమిళ సూపర్ స్టార్ అజిత్ గాయాలపాలయ్యాడు. షూటింగ్ చేస్తుండగా ఈయనకు యాక్సిడెంట్ అయింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ అది చిన్నదే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా చాలా సార్లు అజిత్ ఇలా గాయాల పాలయ్యాడు. ఇప్పుడు మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. అభిమానుల కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు స్టార్ హీరో అజిత్. అందుకే తరుచుగా షూటింగ్స్‌లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం ఈయన సిహెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
 అజిత్ (ajith accident)
అజిత్ (ajith accident)


ఈ చిత్ర షూటింగ్‌లో ఓ యాక్షన్ సన్నివేశం కోసం బైక్ చేజింగ్ చేస్తున్న తరుణంలో అజిత్‌కు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. షూట్ చేస్తుండగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడటం శుభసూచకం. ఈ ప్రమాదంలో అజిత్ చేతులకి, కాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. 20 నిమిషాల విశ్రాంతి తర్వాత మళ్ళీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సీన్ షూటింగ్ పూర్తైన తర్వాతే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు అజిత్.
 అజిత్ (ajith accident)
అజిత్ (ajith accident)

కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో వారం రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. సాధారణంగా బైక్ రేస్ సీన్స్ అంటే అజిత్‌కు చాలా యిష్టం. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో చిత్రయూనిట్ కూడా కంగారు పడ్డారు. సీరియస్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: February 19, 2020, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading