తమిళ అగ్ర హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..

చెన్నైలో శాలిగ్రామంలో ఉన్న విజయ్ ఇంటి వద్ద బాంబు పెట్టినట్టు స్థానిక పోలీసులకు ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి చెప్పడం తీవ్ర కలకలం రేపింది.

news18-telugu
Updated: October 29, 2019, 6:33 PM IST
తమిళ అగ్ర హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..
విజయ్ (File photo)
  • Share this:
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తాజాగా ‘బిగిల్’ సినిమా సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు  కోలీవుడ్‌లో వరుస విజయాలతో రజినీకాంత్‌ను మించిన ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు విజయ్. తాజాగా చెన్నైలో శాలిగ్రామంలో ఉన్న విజయ్ ఇంటి వద్ద బాంబు పెట్టినట్టు స్థానిక పోలీసులకు ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి చెప్పడం తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు విజయ్ ఇంటికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. పోలీసులు తనిఖీలు చేసే సమయంలో ఇంట్లో విజయ్ తల్లి శోభన, తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ఉన్నారు. వారిని పోలీసులు అప్రమత్తం చేసి వెళ్లారు. ప్రస్తుతం విజయ్ ఆయన భార్య సంగీత ఇద్దరు పిల్లలతో కలిసి ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఉన్న మరో ఇంట్లో నివాసం  ఉంటున్నాడు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు.ఒక సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫోను తమిళనాడులోని పోరూరు సమీపంలోని అలప్పక్కంకు చెందిన వ్యక్తి నుంచి వచ్చినట్టు పోలీసులు తేల్చారు. వెంటనే ఆ యువకుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని బాంబు బెదిరింపు కాల్ పై  విచారిస్తున్నారు.

 

First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com