పులుల కోసం విజయ్ సేతుపతి పోరాటం.. రక్షణ కోసం విరాళం..

ఎవ‌రైనా కుక్క‌ల్ని, పిల్లుల్ని ద‌త్త‌త తీసుకుంటారు.. వాటిని పెంచుకుంటారు. కానీ పులుల్ని ద‌త్త‌త తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు త‌మిళ్ హీరో విజ‌య్ సేతుప‌తి ఇదే చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 4, 2019, 5:30 PM IST
పులుల కోసం విజయ్ సేతుపతి పోరాటం.. రక్షణ కోసం విరాళం..
విజయ్ సేతుపతి పులి
  • Share this:
ఎవ‌రైనా కుక్క‌ల్ని, పిల్లుల్ని ద‌త్త‌త తీసుకుంటారు.. వాటిని పెంచుకుంటారు. కానీ పులుల్ని ద‌త్త‌త తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు త‌మిళ్ హీరో విజ‌య్ సేతుప‌తి ఇదే చేసాడు. ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు.. ఆ సంపాదించిన దాంట్లో ఎంత సాయం చేస్తున్నాం అనేది కూడా ముఖ్య‌మే. ఈ విష‌యంలో చాలా మంది కంటే ముందుంటాడు విజయ్‌ సేతుపతి. ఈయ‌న్ని అందుకే ప్రేక్ష‌కులు కూడా మ‌క్క‌ల్ సెల్వ‌న్ అని పిలుచుకుంటారు. అంటే ప్ర‌జ‌ల మ‌నిషి అని అర్థం. నిజంగానే ఈయన చేస్తున్న పనులు కూడా ఇలాగే ఉన్నాయిప్పుడు.

Tamil Star Hero Vijay Sethupathi adopted two tigers and Given 5 lacks fund to Chennai Zoo pk.. ఎవ‌రైనా కుక్క‌ల్ని, పిల్లుల్ని ద‌త్త‌త తీసుకుంటారు.. వాటిని పెంచుకుంటారు. కానీ పులుల్ని ద‌త్త‌త తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు త‌మిళ్ హీరో విజ‌య్ సేతుప‌తి ఇదే చేసాడు. vijay sethupathi,vijay sethupathi twitter,vijay sethupathi tigers adopts,vijay sethupathi adopts two white tigers,Vijay Sethupathi adopts two tigers,Vijay Sethupathi movies,Vijay Sethupathi sye raa narasimha reddy,telugu cinema,Vijay Sethupathi donates 5 lacks to zoo,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి పులులు,పులుల్ని దత్తత తీసుకున్న విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి,విజయ్ సేతుపతి సినిమాలు,విజయ్ సేతుపతి చెన్నై జూ పార్క్
విజయ్ సేతుపతి పులి

సినిమాల్లోనే కాదు.. బ‌య‌ట కూడా హీరోనే ఈయ‌న‌. ఎందుకంటే ఎవ‌రికి ఏ చిన్న సాయం కావాలన్నా కూడా ఈయ‌న ముందుంటాడు. మొన్న కూడా ఓ సీనియ‌ర్ న‌టి క‌ష్టాల్లో ఉంటే సాయం చేసాడు. ఇక మ‌నుషుల‌పైనే కాదు.. జంతువులపై కూడా ప్రేమ చూపిస్తున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు కూడా ఇదే చేసాడు విజ‌య్. తాజాగా చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్‌ అన్నా జంతు ప్రదర్శన శాలకు వెళ్లిన‌ విజయ్‌.. అక్క‌డ రెండు తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకున్నాడు. తీసుకోవ‌డ‌మే కాకుండా జూ అధికారులకు వాటి సంక్షేమం కోసం 5 లక్షలను విరాళంగా ఇచ్చాడు విజ‌య్ సేతుప‌తి.

Tamil Star Hero Vijay Sethupathi adopted two tigers and Given 5 lacks fund to Chennai Zoo pk.. ఎవ‌రైనా కుక్క‌ల్ని, పిల్లుల్ని ద‌త్త‌త తీసుకుంటారు.. వాటిని పెంచుకుంటారు. కానీ పులుల్ని ద‌త్త‌త తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు త‌మిళ్ హీరో విజ‌య్ సేతుప‌తి ఇదే చేసాడు. vijay sethupathi,vijay sethupathi twitter,vijay sethupathi tigers adopts,vijay sethupathi adopts two white tigers,Vijay Sethupathi adopts two tigers,Vijay Sethupathi movies,Vijay Sethupathi sye raa narasimha reddy,telugu cinema,Vijay Sethupathi donates 5 lacks to zoo,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి పులులు,పులుల్ని దత్తత తీసుకున్న విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి,విజయ్ సేతుపతి సినిమాలు,విజయ్ సేతుపతి చెన్నై జూ పార్క్
విజయ్ సేతుపతి పులి

ఇక‌పై వాటికి కావ‌ల్సిన పూర్తి బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్పాడు ఈ హీరో. దేశంలో అంతరించిపోతున్న పుల‌లును కాపాడుకునే బాధ్య‌త అంద‌రిపై ఉందంటున్నాడు ఈ హీరో. అందుకే మ‌న జంతువులను కాపాడుకుందాం అని పిలుపునిచ్చాడు విజ‌య్ సేతుప‌తి. వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం ఎవ‌రికి ఎంత వీలుంటే అంత విరాళం ఇవ్వాల‌ని కోరుకుంటున్నాడు విజ‌య్ సేతుప‌తి. ఇదిలా ఉంటే గ‌తంలో శివ కార్తికేయ‌న్ కూడా ఓ పులిని ద‌త్త‌త తీసుకున్నాడు. ఇప్పుడు ఈయ‌న దారిలోనే విజ‌య్ సేతుప‌తి కూడా వెళ్తున్నాడు.
First published: March 4, 2019, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading