Vijay Political Party | మన దేశంలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. ముఖ్యంగా దక్షిణాది నటులు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత మన దగ్గర చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్టాపించి.. పొలిటికల్ అనుభవం లేక తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరోవైపు తమిళనాట కూడా సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తన రాజకీయ భవితవ్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఎమ్జీఆర్ తర్వాత శివాజీ గణేషన్.. కూడా పొలిటిక్స్‌లో ప్రవేశించారు. ఆ తర్వాత విజయ్ కాంత్ కూడా ఎండీఎంకే పార్టీ స్థాపించారు. ఒకసారి ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగారు. ఆ తర్వా కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 2021 తమిళనాడు ఎన్నికలలోగా రాజకీయ అరంగేట్రం చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సంగతి పక్కనపెడితే.. తమిళనాట ప్రముఖ యాక్షన్ చిత్రాల దర్శకుడు .. హీరో విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ .. తన కొడుకు విజయ్ పేరిట.. ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్’ అనే పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇది విజయ్ పొలిటికల్ పార్టీ కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు. తన అబ్బాయి విజయ్.. పాలిటిక్స్‌లోకి వచ్చి పోటీ చేస్తాడా లేదా అనేది ఆయన తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మరోవైపు తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్నిహీరో విజయ్.. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే.. చాలా మంది మాత్రం విజయ్.. అనుమతి లేనిదే.. ఆయన తండ్రి చంద్రశేఖర్ కొత్త పార్టీ కోసం దరఖాస్తు చేసే సాహసం చేయడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదంత హీరో విజయ్.. పొలిటికల్ స్టంట్ అని కూడా అంటున్నారు.తనకు సంబందం లేదని విజయ్ వ్యాఖ్యానిస్తే.. అభిమానులు రాజకీయాల్లో రావాలంటూ పిలుపునిచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి పొలిటికల్ అరంగేట్రం చేయడమా లేదా అనేది విజయ్ తేలాల్సి ఉంటుంది.
ఒకవేళ తన తండ్రి తన పేరిట ఏర్పాటు చేసిన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సరైన ఫలితాన్ని అందుకోకపోయినా.. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల వరకు తన పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు కొంత మంది రాజకీయ అనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, రజినీకాంత్‌లకు మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో కొనసాగేలా వయసు సహకరించకపోవచ్చని విజయ్ అభిమానులు చెప్పుకొంటున్నారు. అపుడు ఆయన్ని ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరు ఆపకపోవచ్చే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రజినీకాంత్, కమల్ హాపన్ ఫ్యాన్స్ మాత్రం.. కరుణానిధిలాగా.. ఏజ్ బార్ అయినా.. రాజకీయాలు శాసించే శక్తి తమ హీరోలకు ఉందంటున్నారు. మొత్తంగా వచ్చే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ కాక మొదలైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Tamil nadu, Tamil nadu Politics, Vijay