Tamil Hero Vijay : వార్నింగ్ ఇచ్చిన విజయ్.. వెనక్కి తగ్గి దాన్ని మూసేసిన తండ్రి..

తండ్రి చంద్రశేఖర్‌తో విజయ్ (Twitter/Photo)

Tamil Hero Vijay : తమిళ అగ్ర హీరో దళపతి విజయ్.. తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన పేరిట తల్లిదండ్రులు స్థాపించిన పార్టీకి తనకు సంబంధం లేదంటూ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్..

  • Share this:
    Tamil Hero Vijay : తమిళ అగ్ర హీరో దళపతి విజయ్.. తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో బాలనటుడిగా ప్రవేశించి హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్. ప్రస్తుతం తమిళంలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలోనే వంశీ పైడిపల్లి సినిమాతో  డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.  విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్. ఈయన తమిళంలో అగ్ర దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తల్లి శోభ. ఈమె సినీ గాయని, రచయిత.

    గతేడాది విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్..'ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' అనే పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించారు. అంతేకాదు కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఈ పార్టీని నమోదు కూడా చేశారు. అప్పట్లో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో విజయ్.. తన తండ్రి స్థాపించిన పార్టీకి తనకు సంబంధం లేదన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ పార్టీలో విజయ్ తండ్రి జనరల్ సెక్రెటరీగా, తల్లి శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.ఇదిలా ఉంటే విజయ్  తన తల్లిదంద్రుడులపై  కేసు పెట్టాడు.  తనను సంప్రదించకుండా తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంపై తల్లి దండ్రులతో పాటు కలిపి మొత్తం 11 మందిపై చెన్నైలోని సివిల్ కోర్టులో  కేసు వేశారు.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    విజయ్ తన పేరున తండ్రి  పార్టీ పెట్టారని తన ఫ్యాన్స్ ఎవరిని కూడా అందులో చేరవద్దని తెలిపాడు. ఇక తన తల్లి తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫోటోలు ఉపయోగిస్తున్నారని అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  ఇకపై తన పేరుతో ఎటువంటి కార్యక్రమాలు, రాజకీయ మీటింగులు నిర్వహించకుండా ఉండటానికే ఈ కేసు పెట్టానని తెలియజేసారు.

    Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

    ఈ సందర్భంగా విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్.. తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన పార్టీని వెంటనే రద్దు చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. అంతేకాదు ఈ పార్టీని సంబంధించిన అన్నింటిని  కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలియజేసారు. అంతేకాదు విజయ్ మక్కలు ఇయ్యమ్ రాజకీయ పార్టీగా కాకుండా ఫ్యాన్ అసోసియేషన్‌గా కొనసాగించబోతున్నట్టు తెలిపారు.

    Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..


    ఇక ఈ విషయం గురించి విజయ్ అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. అనవసరంగా విజయ్ ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ తనను హీరోగానే కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గతంలో కూడా విజయ్ ఫోటోను క్రికెటర్ ధోని ఫోటోను బ్యానర్ లో పెట్టి రాజకీయంగా బాగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: